ముందస్తు ఎన్నికల ప్రకటించిన కెసిఆర్ అప్పుడే ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికలలో కేసీఆర్ నీ గద్దె దించాలని పొత్తుల కోసం ఆయా పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే...అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటో  తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు..ఇలా ఎవరికి అర్థం కావటం లేదు.

Image result for ysrcp jagan

ఈ క్రమంలో గత ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన వైసిపి మూడు శాసనసభ స్థానాలను ఒక లోక్సభ స్థానాన్ని సాధించింది… ఇదిలా ఉండగా రాబోయే ముందస్తు ఎన్నికల విషయంలో ఇప్పటివరకు ఏ విషయము తెలియ జేయలేదు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైసీపీ పార్టీ. అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆంధ్రాలో విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది నాయకులు కలిశారట.

Related image

ఈ క్రమంలో జగన్ ఆదేశిస్తే తెలంగాణలో వైసీపీ పోటీ చేసేందుకు రెడీ గా ఉన్నామని అన్నారట తెలంగాణ రాష్ట్ర వైసీపీ నేతలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున పోటీకి చాలా మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు. పార్టీలో ఇప్పటికే పని చేస్తున్న వాళ్లు, కొత్త ఆశవహులు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. షాద్ నగర్ లోని వైసీపీ నేతలు ఈ మేరకు సమావేశం కూడా నిర్వహించారు.

Related image

అధినేత జగన్ ఒప్పుకుంటే తాము పోటీ చేస్తామని అక్కడి నేతలు ప్రకటించారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో కూడా వైసిపి పార్టీకి మంచి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో తెలంగాణ వైసీపీ పార్టీకి చెందిన నేతలు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని జగన్ తో అన్నట్లు సమాచారం. మరి రాబోయే తెలంగాణ ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: