బీజేపీలో ఆ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. పార్టీలో కీలకమైన స్థానాలలో ఉన్న వారే ఇలా అంటే ఇంక పుట్టె మునిగినట్లేనని కంగారు పడుతున్నారు. మనసులో ఏదీ లేకపోతే మాట అలా రాదు కదా అని తర్కించుకుంటున్నారు. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా రాజు గారు అలా బయటపడిపోయారని అంటున్నారు.


అలా  జాక్ పాట్ :


నిజానికి బీజేపీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో విష్ణకుమార్ రాజు చివరి నిముషంలో టికెట్ కొట్టేసి అంతే లక్కీగా ఎమ్మెల్యే అయిపోయారు. ఆయనకు పార్టీలో పురందేశ్వరి మద్దతు ఉందని టాక్. దాంతోనే టికెట్ తెచ్చేసుకున్నారని అంటారు. ఇక  విశాఖ ఉత్తరం  సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీకి పొత్తులో చిత్తు అయింది. వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నా పొరపాట్లు, తడబాట్లతో సీటు జారిపోయింది.


అదీ లక్కే :


ఇక బీజేపీ లో తొలిసారి ఎమ్మెల్యే అయినా ఏకంగా పార్టీ శాసన సభ అపక్ష నాయకుడు కావడం కూడా రాజు గారికి లక్కే అంటున్నారు. పార్టీలో అలా ఓ వెలుగు వెలిగిపోయిన ఆయన పొత్తు ఉన్నంత వరకూ బాబు గారిని బాగానే కీర్తిస్తూ వచ్చారు. అసెంబ్లీ లోపలా బయటా కూడా పొగుడుతూనే వెళ్ళారు. ఎంతలా అంటే బాబుకే తెలియని అందమంతా అయనలోనే ఉందనేటంత.


ఓటమి గుబులు :


పొత్తు పెటాకులు అయ్యాక రాజు గారిలో ఓటమి గుబులు పట్టుకుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా ఆయన ఇప్పటికైతే రెడీగా లేరు. ఏపీలోనీ బీజేపీకి ఉనికి లేదు. విశాఖలో గెలిచే సత్తా అంత కంటే లేదు. దాంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని టాక్ ఉంది. మరో వైపు టీడీపీతోనూ టచ్ లో ఉంటున్నారని పుకార్లు ఉన్నాయి. ఇలా ఫ్యూచర్ పాలిటిక్స్ పై రాజు గారు ఆలొచనలు చేస్తూనే మనసులోని మాటలను అసెంబ్లీలో చెప్పేశారని అంటున్నారు. నేను బీజేపీలో ఉంటానో లేదో అన్న రాజు గారి మాట ఇపుడు బాగా వైరల్ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: