ఇంతకాలం ఏది కోరుకోలేదే అదే జరిగేలా ఉంది. పక్కనున్న తెలంగాణాను, ఇష్టమైన హైదరాబాద్ ని కూడా వదులుకుని వచ్చేసినా ఫలితం లేకుండా పోతోంది. కొరివితోనైన తల గోక్కోవచ్చేమో కానీ ఆయనతో పెట్టుకోవద్దు అనుకున్నా కుదరడం లేదు. ముందస్తు ముప్పు డైరెక్ట్ గా  ఇటే తగిలేట్టు ఉంది. చూడబోతే యవ్వారం ఓ రేంజిలో కదిలేలా ఉంది. 


ఇది ట్రయల్ :


జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసు జారీ చేశారు. 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తప్పుడు డాక్యుమెంట్లతో అక్రమంగా సొసైటీలో కొంతమందికి స్థలాలు కేటాయించడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసుల తదుపరి పరిణామం ఓటుకునోటులో అరెస్టేనని అంటున్నారు. ఓటుకునోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఇది ట్రయల్ అని అంటున్నారు. 


ఓటుకు నోటు కోసమేనా :


చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాత్రదారిగా  సాగించిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా స్టీఫెన్ సన్ తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్ కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


స్కెచ్ రెడీ :


మహా కూటమి పేరుతో చెలరేగిపోతున్న కాంగ్రెస్ ని ఏదోల కట్టడి చేస్తున్న కేసీయార్ చంద్రబాబు ని మాత్రం అలా ఇలా వదిలేలా లేరని అంటున్నారు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికల్ల ముందస్తు నోటీసులు రేవంత్ కి ఇప్పించి బాబు కు షాక్ ఇచ్చారని అంటున్నారు. బాబుని ఇరికించాలంటే రేవంత్ ని ముగ్గులోకి లాగలి. అందుకే పక్కాగ స్కెచ్ వేశారనీ అంటున్నారు.  చూడాలి రేపటి రోజు ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: