ముందస్తు ఎన్నికలు ప్రకటించిన టిఆర్ఎస్ పార్టీ.. మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పక్కా ప్రణాళికలతో పగడ్బందీగా నడుచుకుంటున్నారు.  అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే రాజకీయా సన్యాసం తీసుకుంటానని తెలియజేస్తూ... వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలుస్తుందని తన కాన్ఫిడెంట్ తెలియజేశారు.

Related image

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. అతి నమ్మకం, అహంకారంతో తాను ఈ మాట అనడం లేదని, ప్రజలపై ఉన్న అచంచల విశ్వాసంతోనే చెబుతున్నానని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించకపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన చెప్పారు.

Related image

ముఖ్యమంత్రి కేసీఆరే ఈ ఎన్నికలకు కర్త, కర్మ, క్రియ అని అన్నారు. విపక్షాలు భయంతో, భీతితో ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

Related image

తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఎన్ని ఆరోపణలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: