అన్ని రాజకీయ పార్టీలతో విజయ్‌ మాల్యాకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. క్రికెటర్లు, సినీ ప్రముఖులు.. విజయ్‌ మాల్యాని ప్రసన్నం చేసుకోవడానికి పోటీపడ్డారు. ఇదీ విజయ్‌ మాల్యా గొప్పతనం. కాదు.. కాదు అతని వెనకాల వున్న డబ్బు తాలూకు గొప్పతనం. నిస్సిగ్గుగా విజయ్‌ మాల్యానికి మన 'రాజకీయం' చట్ట సభలకు పంపేసింది. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తూ, దేశాన్ని ఇంకా ముంచేయాలనుకున్న విజయ్‌ మాల్యాని ఏమనాలి.? 

Image result for vijay mallya

నిజానికి, విజయ్‌ మాల్యాని కాదు.. అతన్ని ఎంకరేజ్‌ చేసిన రాజకీయ పార్టీల్ని నిలదీయాలి. కాంగ్రెస్‌ ఎంకరేజ్‌ చేసింది.. బీజేపీ అతన్ని అవసరానికి తగ్గట్టు వాడుకుంది.. ఆపదలో వున్నప్పుడు, తెలివిగా విదేశాలకు విజయ్‌ మాల్యాని పంపించింది మన రాజకీయం. తాను ఎలా విదేశాలకు పారిపోయిందీ చెబుతూ, అలా పారిపోవడానికి ముందు కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ సలహా తీసుకున్నానని సెలవిచ్చాడు విజయ్‌ మాల్యా.

Image result for vijay mallya

ఇది నిజమా.? కాదా.? అన్న విషయం పక్కనపెడితే.. సలహా ఇచ్చేంత చనువు అయితే విజయ్‌ మాల్యాతో, అరుణ్‌ జైట్లీకి ఖచ్చితంగా వుండే వుంటుంది. అరుణ్‌ జైట్లీతోనే కాదు, మోడీతోనూ సాన్నిహిత్యం నడపగల దమ్మున్నోడు విజయ్‌ మాల్యా. కాంగ్రెస్‌తో ఆయన సంబంధాలు రహస్యమేమీ కాదు. దేశాన్ని ఉద్ధరించేస్తానంటూ కంకణం కట్టుకున్నట్లు కథలు చెప్పే అరుణ్‌ జైట్లీ, తన గురించి విజయ్‌ మాల్యా నోరు విప్పేసరికి కంగారు పడిపోతున్నారు. 'అబ్బే, అదంతా అబద్ధం..' అంటూ బుజాలు తడిమేసుకుంటున్నారు. ఎన్డీయే నాలుగేళ్ళ పాలనలో దేశం విడిచిపారిపోయిన బడా దొంగల్లో విజయ్‌ మాల్యా ఒకడు మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: