భారతదేశం భిన్న ప్రాంతాలు, మతాలు, కులాల సమ్మేళనం. ఈ దేశంలో గజానికో పద్ధతి, అడుగుకో విధానమూ ఉంటాయి. అన్నిటికంటే మిన్న ఏంటంటే ఎవరికైన ఏదైన మాట్లాడే స్వేచ్చ ఇక్కడ పుష్కలంగా ఉంది. మరో విధంగా చెప్పుకోవాలంటే అతి స్వేచ్చతో మనం దేశాన్ని, దేశ హితాన్ని తరచూ  మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాం. 


అలాటి నేత ఉండాలి :


బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఓ మాట అన్నారని ప్రచారంలో ఉంది. అది ఎంతవరకూ నిజమో కానీ ఈ దేశానికి అతి స్వేచ్చ కూడా పనికిరాదన్నది పదే పదే ప్రూవ్ అవుతున్న వాస్తవం. దేశాన్ని తనదైన గట్టి పాలనతో గడగడలాడించిన నాయకురాలుగా ఇందిరాగాంధీని చెప్పుకుంటాం. ఆమె ఎమర్జెన్సీని కూడా సమర్ధించే వారు దేశంలో ఇప్పటికీ ఉన్నారు. ఆఫీసులకు ఠంచన్ గా రావడం, అన్ని సక్రమంగా పాటించడం వంటివి జరిగాయని అప్పటి వారు గుర్తు చేసుకుంటారు. అవినీతికి కూడా నాడు ఆస్కారం లేదని అంటారు. .


మోడీ బలమైన నేత :


నరేంద్ర మోడీ విషయానికి వస్తే బలమైన నాయకునిగా ఈ దేశంలోని చాల మంది భావిస్తారు. ఆయన పాలనా విధానాలతో విభేదించేవారు సైతం  మోడీ ఉండాల్సిందేనని అంటారు. ఈ దేశం కోసమైనా అయన ప్రధానిగా కావాలని, రావాలని అనే వారు ఎక్కువమందే ఉన్నారు. మోడీ అంటే దాయాది దేశం వణుకుంది, చైనా అప్రమత్తం అవుతుంది. మోడీ ఉంటే  అమెరికా విలువ ఇస్తుంది. ప్రపంచం ఇపువైపు చూస్తుంది. అందుకే మోడీ రావాలి అందే దేశ భక్తులూ ఉన్నారు.


నాలుగు డశాబ్దాల తరువాత :


ఈ దేశం అస్తిర రాజకీయలకు బలి అయిపోయింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుస్తిర పాలన లేకుండా దశాబ్దాలు దొర్లిపోయాయి. ఇందిర మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా వచ్చారు కానీ, బలమైన నాయకత్వం అందించలేకపోయారు. ఇక ఆ తరువాత వీపీ సింగ్, చంద్రశేఖర్ పాలన మూన్నాళ్ళ ముచ్చట అయింది. పీవీ సైతం మైనారిటీ రాజ్యమే చేశారు. వాజ్ పేయ్ 23 పార్టీల కూటమిని నడిపారు. యూపీయే వన్, టూ సంగతి సరే సరి.. మొత్తం రిమోట్ కంట్రోల్ పాలన. 2014లో మాత్రమే మోడీకి ఫుల్ మెజారిటీ వచ్చి గట్టి నాయకుడు దొరికారు దేశానికి.


కఠినమూ అవసరమే :


మోడీ మొండివారని అంటారు. కానీ ఒక నిర్ణయం అమలు చేయాలంటే ఈ దేశంలో కఠినంగానే ఉండాలి. లేకపోతే భిన్న వాదనలతో ముందుకు సాగనివ్వరు. పెద్ద నోట్లు, జీఎస్టీ వల్ల లాభం నష్టం అన్నది పక్కన పెడితే మోడీ కాబట్టే నిర్ణయాలు వెంటనే తీసుకోగలిగారు అన్న మాట అందరిలోనూ ఉంది. ఇక దాయాది పాకిస్థాన్ తో సర్జికల్ స్ట్రైక్ పేరిట దాడులు చేసినా మోడీకే సాధ్యమన్నదీ తెలిసిందే. అందుకే ఈ దేశం ముందుకు పోవాలన్నా, బయట వారికి మనమంటే గౌరవం పెరగాలన్నా మోడీ వంటి నాయకుడు ఉండాల్సిందే. ఇది ఎవరి వ్యక్తిగత లాభాలను బేరీజు వేసుకోకుండా చూస్తే చెప్పే మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: