విజయం ఒక్కటి రావాలంటేనే కొందరికి జీవిత కాలం సరిపోదు. అలాంటిది విజయాల మీద విజయాలు. ఒకటి రెండూ కాదు గురి పెడితే లక్ష్యం సాధించడమే. అదే ఆయనకు తెలిసిన సక్సెస్ మంత్రం. విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకుని నిరంతరంగా వాటిని ఒడిసిపట్టడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన నరేంద్ర మోడీ కాదు, విజయేంద్ర మోడీ అయ్యారు. 


అలా మొదలైంది :


నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించారు. అది లగాయితూ ప్రతి ఎన్నికల్లోనూ పార్టీని గెలిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి పాతికేళ్ళుగా గుజరాత్ గడ్డ మీద కాషాయం జెండా అప్రతిహతంగా ఎగురుతోంది అంటే మోడీ నెట్ వ‌ర్క్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్యన లేటేస్ట్ గా జరిగిన ఎన్నికల్లోనొ ఆరవసారి వరసగా గుజరాత్ గద్దె మీద బీజేపీ కూర్చోబెట్టిన ఘనత అచ్చంగా మోడీదే.


మరో రికార్డ్ :


బీజేపీ పెట్టిన తరువాత లోక్ సభ ఎన్నిలల్లో ఏనాడూ మెజారిటీ కదు కదా దరిదాపుల్లోకి రాలేదు. అటువంటి పార్టీని ఏకంగా 283 సీట్లు సంపాదించిపెట్టి సొంతంగా డిల్లీ పీఠం ఎక్కిన రికార్డ్ కూడా మోడీదే. ఇది దిమ్మ తిరిగే విజయం. కలలో కూడా కమలం పార్టీ తలవని ఘన విజయం. సాధించింది మోడీ అందుకే ఆయన అసాధ్యుడు.


దేశమంతా కాషాయం :


మోడీ ప్రధానిగా ఉండడమే కాదు దేశమంతా బీజేపీ గాలిని బలంగా వీచేలా చేయగలిగారు. ఈ రోజుకు దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ఉందంటే ఆ గొప్పతనం మోడీదే అనడంలో సందేహం లేదు. వామపక్ష భావజాలం కలిగి ద‌శాబ్దాల పాటు అధికారంలో ఉన్న త్రిపుర సర్కార్ ని కూల్చి కమలాన్ని నిలబెట్టిన మొనగాడు కూడా మోడీనే. ఇక అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడిందంటే అది కూడా మోడీ ఘనతగానే చూడాలి. కొరుకుడు పడని చోట ఎదురు నిలిచి విజయం తన వైపుగా మార్చుకోవడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన విజయానికి కేరాఫ్ అడ్డ్రెస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: