తెలంగాణాలో రేపటి రోజున జరిగే ఎన్నికల్లో మరో మారు సీఎం పీఠం ఎక్కబోయేది కేసీయారేనని లేటెస్ట్ సర్వే కుండ బద్దలు కొట్టింది. ఇండియా టు  డే సర్వేలో కేసీయార్ కు 43 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ తరఫున ఉత్తం కుమార్ రెడ్డికి 18 శాతమే ఓట్లు వచ్చాయి. అంటే కేసీయార్ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారని స్పష్టమవుతోంది.


పోటీ లేదా :


తెలంగాణా ఎన్నికల్లో సీఎం కేసీయార్ కి పోటీదారులే లేరా అన్న ప్రశ్న ఇక్కడ వస్తోంది. ఎందుచేతనంటే ఆయనకు సమ ఉజ్జీగా ఎవరూ సమీపంలో కూడా లేరని సర్వేలు తేల్చడమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి ఆయనను పెట్టి సర్వే చేశారు. ఒక వేళ మరి కొందరి కాంగ్రెస్ నాయకులూ పేర్లు తీసుకున్నా కేసీయార్ కి సాటి రారన్నది స్పష్టమవుతోంది. అంటే ఓటర్ కి సీఎం క్యాండిడేట్ ఎవరో టీయారెస్ క్లారిటీగా చెబుతోంది. అదే కాంగ్రెస్ లో ఎవరు అవుతోరో ఇప్పటికీ తెలియదు. ఈ గందర గోళం పూర్తిగా కేసీయార్ కి లాభించే అవకాశం నూరు శాతం ఉంది.


లీడర్ ని చూసే :


గత కొన్నేళ్ళుగా దేశ రాజకీయాల్లో మార్పు బాగా కనిపిస్తోంది. పార్టీలు, సిధ్ధాంతాలను చూసి ఓటేసే రోజులు పోయాయి. అదే సమయంలో లీడర్ల చరిష్మాను చూసి ఓట్లు వేస్తున్నారు. ఆ విధంగానే అప్పట్లో వాజ్ పేయ్, తరువాత మోడీ ప్రధానులు అయ్యారు. ఇపుడు రాష్ట్రాల్లో అదే ట్రేండ్ కనిపిస్తోంది. బీహార్లో నితీష్ కుమారు. బెంగాల్లో మమత, డిల్లీలో కేజీవాల్ ఇలా నాయకులను చూసే జనం ఓటేస్తున్నారు. 


తెలంగాణాలోనొ కేసీయార్ పెద్ద అట్ట్రక్షన్. ఆయన ముందు ఎవరైనా దిగ దుడుపే. అందువల్ల ఓటర్లకు అంత కంటే బెటర్ సీఎం క్యాండిడేట్ కూటమి నుంచి పెట్టినపుడు మాత్రేమే టీయారెస్ ని ఎదుర్కోగలరు. చూడబోతే కాంగ్రెస్ లో సీఎం కుర్చీకి పెద్ద పోటీయే ఉంది. సో ఈ అయోమయం కేసీయార్కే లాభం, మరో మారు ఆయెనే సీఎం అవడమూ ఖాయమనే సర్వేల్లో జనం చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: