సినీ నటుడిగా శివాజీ చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అటు స్టార్ ఇమేజ్ లేకపోవడం, ఇటు కుర్ర హీరోల జోరు ఎక్కువ కావడంతో ఆయన సినిమాలకు బ్రేక్ పడింది. సరిగ్గా ఇదే టైంలో సమైక్యాంధ్రా ఉద్యమం ఆరంభం కావడంతో శివాజీ ఈ వైపుగా వచ్చారు. సినిమా నటులలో సమాజం వైపు చూసే వ్యక్తిగా,  స్ప్రుహ ఉన్న యాక్టర్ గా శివాజీ  పేరు తెచ్చుకున్నారు.


హోదాపైనా పోరు :


ఇక ఎటూ విభజన జరిగిపోయింది. దాంతో ప్రత్యేక హోదా పేరిట సాధన సమితిని ఏర్పాటు చేసి పోరాడిన వాళ్ళలో శివాజీ కూడా ఉన్నారు. ఆనాడు ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గట్టిగానే ఆరోపణలు చేస్తూ వచ్చరు. ఓ విధంగా ఏపీ ప్రజల గొంతు వినిపించారని చెప్పుకోవాలి. అల ప్రజల్లో బాగానే ఉంటూ వచ్చారు.


బాబు రూట్లోకి :


ఇలా ఉన్న శివాజీ సడెన్ గా బాబు రూట్లోకి వచ్చారు. ఎపుడైతే బీజేపీకి టీడీపీ విడాకులు ఇచ్చిందో నాటి నుంచి టీడీపీ వైపు శివాజీ నిలబడ్డారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో హోదా రాకపోవడానికి బీజేపీనే కారణం. బాబు హటాత్తుగా.  చాలా మంచి అయిపోయారు. నిజానికి నాలుగేళ్ళుగా కలసి ఉన్న టీడీపీ, బీజేపీ రెండూ కూడా హోదా రాకపోవడానికి కారణమని జనం నమ్ముతున్నారు, మరి ఇక్కడే శివాజీ ఏపీ జనాలకు భిన్నమైన రూట్లో వెళ్ళారు.


ఆ ముద్ర వచ్చేసింది :


ఎపుడైతే శివాజీ టీడీపీ అనుకూలుడయ్యారో ఆయనపైన ఉన్న న్యూట్రల్ ముద్ర ఒక్కసారిగా చెదిరిపోయింది. జనాలు కూడా ఆయన్ని నమ్మడం మానేశారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గరుడా అంటూ శివాజీ కొత్త విషయాలంటూ సెన్సేషన్ కావడానికి చూశారు. అయితే చంద్రబాబు కి ఏం కాదని, ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నది ఏపీ ప్రజల ద్రుఢ నమ్మకం. ఇలా మరోమారు శివాజీ తనకు తానుగానే స్టేట్మెంట్లు ఇచ్చేసి జనంలో పరువు పోగొట్టుకున్నారు

ఇన్ని విధాలుగా కిందా మీదా పడుతున్న శివాజీకి ఏం కావాలన్నది  ఇపుడు జనం ప్రశ్న . బాబు అండ్ కో చేతిలో పావుగా మారిపోయారని బీజేపీ సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న ఈ టైంలో శివాజీ ఇక హ్యాపీగా పసుపు చొక్కా వేసేసుకోవచ్చు. ఆయన్ని న్యూట్రల్ గా ముందు పెట్టి టీడీపీ ఆడుతున్న డ్రామా కూడా రట్టు అయిన నేపధ్యంలో శివాజీ టీడీపీకి కొత్త తమ్ముడు కావడమే ఇక మిగిలి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: