రాజకీయ నాయకుడికీ ఎన్నికలకూ ఉన్న సంబంధాన్ని నీటితో చేపకు ఉన్న బంధంతో పోల్చాలి. ఎన్నికలు ఎపుడూ నాయకుడు కోరుకుంటాదు. మరి ఎన్నికలు అంటే భయపడే వారిని నాయకులు అనగలమా. సాధారణంగా ఈ దేశంలో నాయకులు ఎపుడు కోరుకుంటే అపుడే ఎన్నికలు వస్తున్నాయి. తమకు అనుకూలత చూసుకునే ఎవరైనా ఎన్నికలను డీ కొడతారు. అలా కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల ధోరణులు భిన్నంగా ఉన్నాయి.


ముందస్తు అంటే జడుపు:


అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అంటారు. మరి అలాంటి చేదు అనుభవం ఉండబట్టే ముందస్తు అన్న మాట వింటేనే చంద్రబాబు జడుసుకుంటున్నారు. మొనీ మధ్య విశాఖలో పార్టీ మీటింగులో జగన్ జనవరిలో ఎన్నికలు రావచ్చు అంటూ సంకేతాలు ఇచ్చారు. ఆ మాట బయటకు రాగానే బాబు అండ్ కో ఓ రేంజిలో జగన్ పై మండిపడిపోయింది. అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ కి ఎలా తెలుసు, ఆయన బీజేపీతో అంటకాగుతున్నడంటూ అటాక్ చేశారు. 


రానే రావట :


ముందస్తు ఎన్నికలు వచ్చే సమస్యే లేదని చంద్రబాబు అంటున్నారు. శ్రీకాకుళం జల హారతి కార్యక్రమానికి వచ్చిన సీఎం ముందస్తు ఎన్నికలు కాదు, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని గట్టిగా చెప్పుకొచ్చారు. మరి ముందస్తు అంటే ఎందుకు   టీడీపీ పెద్దలు అంతగా  కంగారు పడుతున్నారో తెలియట్లేదు.  పొరుగు రాష్ట్రంలో కేసీయార్ ముందస్తుకు వెళ్తున్నారు, రణ క్షేత్రంలోకి వీరుడిలా దూకేసారు. మరి దానిపైనా మంత్రి లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. ముందస్తు అంటే ప్రజల ఆకాంక్షలను  దెబ్బ తీయడమేనని అన్నారు. బాగానే ఉంది కానీ తన తండ్రి చంద్రబాబు 2004లో ముందస్తు ఎన్నికలకు వెల్లిన సంగతినే ఇక్కడ లోకేష్ మరచిపోతే ఎలా అని సెటైర్లు పడ్డాయనుకోండి.


అనుకూలత లేదా :



ముందస్తు అంటే టీడీపీ జడుపు వెనక కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీలో సానుకూలత లేకనే ఆ పార్టీ ఇలా కౌంటర్లేస్తోందని అంటున్నారు. నిజానికి మోడీతో కలసి ఉన్నపుడు జమిలికి జై కొట్టిన టీడీపీ ఎన్నికలు ఎపుడు వచ్చినా రెడీ అని అప్పట్లో భారీ స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి విధితమే. మరి ఇపుడు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ కొత్త పాట పాడుతోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు ఘాషించండం వల్లే  పసుపు శిబిరం ముందస్తు అంటే వణుకుతోందని అంటున్నారు. 

ఓడిపోయే పరిస్తితే ఉంటే జనవరిలో ఎన్నికలైనా, మేలో జరిగినా  ఫలితం ఒక్కటే అన్న సంగతి ఎంతో అనుభవం ఉన్న టీడీపీ పెద్దలకు తెలియనిది కాదు. అయితే ఉన్నంతలో అధికారం పూర్తిగా ఎంజాయ్ చేద్దామన్న తపనతోనే ఇలా మాట్లాడుతున్నారని అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: