టీడీపీ అధినేత చంద్రబాబు ని చాలా తక్కువ అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీ.  తెలంగాణలో టీడీపీ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని మిగిలిన చిన్న చిన్న పార్టీలని కూటమి పేరుతో  తమ దారిలో పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి వెళ్ళాలని కాంగ్రెస్ వేసిన స్కెచ్ అంతా బాగానే ఉంది కానీ కాంగ్రెస్ కబంద హస్తం లోకి చంద్రబాబు అంత ఈజీగా వెళ్ళిపోతారా..? తెలంగాణలో కోల్పోయిన పునర్వైభవం తిరిగి సంపాదించుకోవాలి అంటే కాంగ్రెస్ ని నమ్మి గుడ్డిగా కూటమిలో చేరిపోతారా..? అవసరాల కోసం కూటమి కలిసింది తప్ప మిగతాదంతా సేం టూ సేం అందుకే కాంగ్రెస్ కి దిమ్మతిరిగిపోయే ఘలక్ ఇచ్చారు చంద్రబాబు

 Related image

ఇంతకీ ఏమిటా ఘలక్ అనేకదా మీ సందేహం..సరే అసలు విషయంలోకి వెళ్తే..ఒక దెబ్బకి రెండు పిట్టలు ఇది పెద్దల నానుడి..కానీ రాజకీయాల్లో ఒక దెబ్బకి ఎన్ని పడితే అన్ని పిట్టలు అనే విధంగా ఉంటుదని అలాంటి నీటిలో ఆరితేరిన చంద్రబాబు  ఒక పని చేస్తే ఎన్ని రకాలుగా పార్టీకి ఉపయోగపడుతుందో అనే ఆలోచన చేస్తారు ఈ సమయంలోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే విమర్శలు తప్పవు కానీ తెలంగాణలో టీడీపీ బలపడాలి అది కానే కూటమికి సంభంధం లేకుండా ఉండాలి ఎలా అని ఆలోచించిన చంద్రబాబు కి కలిసొచ్చింది బాబ్లీ ప్రాజెక్ట్ ఇష్యూ.

 Image result for babli project chandrababu

కాంగ్రెస్ నేతలకి తుప్పు ఒదిలిపోయేలా..కళ్ళు బైర్లు కమ్మేలా బాబు బాబ్లీ ని తెరపైకి తీసుకువచ్చారనేది విశ్లేషకుల వాదన..అయితే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఒక వ్యక్తి బాబు అండ్ కో ని అరెస్ట్ చేయమని కోర్టుని కోరడం ఏమిటి కోర్టు సీఎం స్థాయిలో ఉన్న బాబు కి నేరుగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఏమిటి..? అసలు బాబు అరెస్ట్ అయితే ఎవరికీ లాభం..? అసలు బాబ్లీ ఇష్యూ లో బాబు ఎందుకు తలదూర్చారు ఎవరి కోసం 40 మందితో ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు అనే విషయాలు ఒక్క సారిగా కాంగ్రెస్ నెమరు వేసుకుంది దాంతో అమ్మ “బాబో” య్ అంటూ నోళ్ళు వెళ్ళబెట్టారట..అయితే

 Related image

ఏదోలా బాబుని ఉపయోగించుకుని తెలంగాణలో తిష్ఠ వేద్దామని కాంగ్రెస్ అధినాయకత్వం అనుకుంటే..కాంగ్రెస్ ని ఉపయోగించుకుని బాబు తెలంగాణలో జెండా టీడీపీ హవా నడిపించాలని అనుకున్నారు...అయితే బాబు వేసిన ఈ స్కెచ్ తో దిమ్మతిరిగిపోయిన కాంగ్రెస్ తెలంగాణా కాంగ్రెస్ నేతలు అందరికీ కీలక ఆదేశాలు జారీ చేశారట.. చంద్రబాబు విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలని కూటమిలో కాంగ్రెస్ హవా నడవాలని చంద్రబాబు ఎత్తులని ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారట..వామ్మో చంద్రబాబు తో జరా జాగ్రత్త అంటూ టీ కాంగ్రెస్ పెద్దలు నేతలకి ఆదేశాలు జారీ చేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: