రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు ఎపుడూ వేరుగానే ఉంటాయంటారు. కాదంటే అవునని, అవునంటే కాదని వారి మాటలకు మార్చి అర్ధాలు చూసుకోవాలి. కళ్ళకు కనిపిస్తున్న దాన్ని కూడా కాదనే నేర్పు రాజకీయ నాయకుల సొంతం. ఆ తానులో ముక్క అయిన ఉమన్ చాందీ గారు లేటెస్ట్ గా ఓ స్టేట్మెంట్ ఇఛ్చారు. నమ్మెద్దామా..


నో చాన్స్ :


ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ ఊమెన్ చాందీ క్లారిటీ ఇస్తున్నారు. అసలు పొత్తు అన్న మాటే లేదని ఖారాఖండీగా చెబుతున్నారు. మొత్తం అన్ని చోట్లా తామే పోటీ చేస్తామని కూడా ఢంకా భజాయిస్తున్నారు. తాము అన్ని విధాలుగా సిధ్ధపడే ఏపీలో తగిన ఏర్పాట్లు చేసుకుంతున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు. రేపు (మంగళవారం)  కర్నూలు జిల్లా పర్యటనకు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా..వాటిని పర్యవేక్షించడానికి చాందీ కర్నూలుకు వచ్చారు.


అది వేరేట :


తెలంగాణలో అక్కడి అవసరాలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీతో పొత్తు కుదిరిందని చాందీ అంటున్నారు. అక్కడ అధికారంలో ఉన్న టీయారెస్ ని ఓడించేందుకు తాము కలసి పొత్తు పెట్టుకోవాల్సి ఉందని లాజిక్ చెప్పారు. మరి ఏపీలో అలాంటిదేదీ లేదని, పైగా తాము ఇక్కడ బలంగా ఉన్నామని కూడా ఉమన్ చాందీ అంటున్నారు. చూడాలి ఈ మాటలు ఎంతకాలం ఉంటాయో, ఈ పొత్తుల ఎత్తులు ఎందాకా వెళ్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: