ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతోపాటు కలిసి వచ్చే ప్రతి పార్టీని కలుపుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏపీలో వామపక్ష పార్టీలతో కలిసి అనేక పోరాటాలు చేసిన పవన్...రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అయిపోయిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలతో పాటు లోక్ సత్తా పార్టీ.. ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలను కూడ కలుపుకునే యోచనలో ఉన్నారట పవన్.

Image may contain: 2 people, text

ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలకు రాష్ట్రంలో ఒక్క శాతం కూడ సపోర్ట్ లేదు. కార్యకర్తలు అసలే లేరు. వీటిని కలుపుకోవడం మూలాన ఆయనకు, మహాకూటమికి ఒరిగేదేమీ ఉండదు. ఇలా నిజాయితీ గల పార్టీలను.. సమాజంలో మార్పు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న ప్రతి పార్టీతో చేతులు కలపడానికి రెడీ అయిపోయారు. ఇలా మహాకూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో...కనీసం కార్యకర్తలు.. పార్టీ నాయకుడు లేని రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కొన్ని స్థానాలు కేటాయించాలి.

Image may contain: 1 person, standing and beard

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు... పవన్ తీసుకున్న నిర్ణయంపై సముఖంగా లేనట్లు సమాచారం. పైగా సదరు పార్టీలకు స్థానాలతో పాటు ప్రచారం కూడా నిర్వహించాలి... గెలిచే అవకాశాలు చాలా తక్కువ... కాబట్టి పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని పార్టీ నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో కనీసం బలం లేని పార్టీలను జనసేన పార్టీ చేర్చుకుంటే ఎన్నికల సమయంలో కొంత డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: