ఓటుకు నోటు కేసులో నిందితుడైన కాంగ్రెస్ నేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా సంచలన కామెంట్స్ చేసారు. ఎన్నికల ముందు తనను జైల్లో వేస్తారు ఏమో అన్న అనుమానంతో ఏమో తెలియదు గానీ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో టి-కాంగ్రెస్ తనకు పదవి ఇవ్వకముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు.

Image result for vote for note images

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ సర్కార్ లేఖ రాసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తన చుట్టూ, తన బంధువుల చుట్టూ తెరాస ప్రభుత్వం నిఘా పెట్టిందని రేవంత్‌ అన్నారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏం జరిగినా కేసీఆర్‌, డీజీపీ, నిఘా ఐజీ ప్రభాకర్‌ రావుదే బాధ్యత అని హెచ్చరించారు. ఈడీని పంపినా.. వంద అక్రమ కేసులు పెట్టినా వదిలేది లేదన్నారు.

Related image

తనపై పెట్టిన ఓటుకు నోటు అక్రమ కేసు తప్పుడు కేసు అని గతంలోనే హైకోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇందుమూలంగా రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డ్రామాలు ఆడిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: