విజయనగరం జిల్లా అంటేనే రాజులు గుర్తుకు వస్తారు. ఓ వైపు విజయనగరం రాజులు, మరో వైపు బొబ్బిలి రాజులు, ఇంకో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం.  ప్రజాస్వామ్యం ఎంతలా వికసించినా ఇక్కడ మాత్రం రాజులంటే భక్తి అలాగే ఉంది. అది ఎన్నికల్లోనూ బాగా కనిపిస్తుంది. మరి రాజుల కోటలో రాజకీయం అంటే ఓ రేంజిలో కిక్కించేదే.


23న‌ జిల్లాకు  జగన్ :


వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో భాగంగా ఈ నెల 23 నుంచి జిల్లాలో కాలు మోపనున్నారు. మొత్తం నెల రోజుల పాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో జగన్ పాదయాత్ర సాగుతుంది. ఎస్ కోటలో తొలి అడుగు వేయడం ద్వారా జిలాలో జగన్ సందడి ప్రారంభం కానుంది. పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చురుకుగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసి ఉంచారు. జగన్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా క్యాడర్ సిధ్ధమైపోయింది.


కోటలో పాగా :


వస్తూనే ఎస్ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ రెడీ అయిపోయారు. ఆయన విశాఖ జిల్లా పాదయాత్రలో ఉండగానే ఎస్ కోటలో రాజకీయాన్ని వైసీపీ వైపు తిప్పేశారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసిన పట్టున్న నాయకుడు  రఘురాజును వైసీపీలో చేర్చుకోవడం ద్వారా ముందే జెండా పాతేశారు. వచ్చే ఎన్నికలకు వైసీపీకి ఇక్కడ ఎదురులేకపోవచ్చునని రాజకీయ విశ్లేషణ‌లు ఉన్నాయి.


బొత్సా అలెర్ట్ :


విజయనగరం జిల్లా అనగనే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. ఆయన వైసీపీ సీనియర్ నాయకుడు. జిల్లాలో ఓడిపోయినా తన పట్టును గట్టిగా నిలుపుకుంటూ వస్తున్న నేతగా ఉన్నారు. మరో వైపు పూసపాటి వంశీకుడు అశోక్ దూకుడుకు ఎప్పటికపుడు కళ్ళెం వేయడమే కాదు. బొబ్బిలి రాజులను మరో చేత్తో నిలువరిస్తున్నారు. జగన్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు బొత్స టీం గట్టిగానే క్రుషి చేస్తోంది. మరి జిల్లాలో జగన్ పాదయాత్ర ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: