విభజనతో ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి రిపేర్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్ రాకుండా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. అయితే ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏపీకి రావలసిన స్పెషల్ స్టేటస్ విషయమై సెంట్రల్ గవర్నమెంట్ కొంత కఠినంగా వ్యవహరించింది.

Image result for rahulgandhi

ఈ నేపథ్యంలో దీన్ని అదునుగా చేసుకొని జాతీయ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో గట్టి వ్యూహం పన్నింది. ఈ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏపీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా రాహుల్‌ గాంధీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదట పెదపాడులో దివంగత సిఎం దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. తరువాత సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Image result for rahulgandhi

భైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. రాహుల్‌ మాట్లాడుతూ… తమ పార్టీ ఆధికారంలోకి వస్తే మహిళల భద్రతకు ప్రత్యేకంగా మహిళ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతేక చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

Image result for rahulgandhi

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టపరంగా విభజన విషయంలో రావలసిన ప్రతి హక్కును కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఇదంతా గమనిస్తున్న అక్కడున్న కొంత మంది ప్రజలు విభజించి రాష్ట్రంలోకి వచ్చి మరీ మీటింగ్ పెట్టారంటే మనము ఎంత మంచోళ్ళుమో అని అంటున్నారు. ఎన్నికల్లో మాత్రం మంచి తీర్పు ఇవ్వాలని పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: