రాహుల్ గాంధీ కర్నూల్ సభలో మాట్లాడుతూ మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అన్నాడు. ఆంధ్ర జనాలకు అందరికీ సంతోషకరమైన వార్తే. కానీ రాహుల్ వల్ల అవుతుందా? అన్నదే క్వశ్చను. ఎందుకంటే కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసి, ఒంటి చేత్తో గెలిచి, మెజారిటీ స్థానాలు తీసుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ ఈ దేశంలో ప్రస్తుతానికి అయితే లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో అంటకాగాలి. ఆయా పార్టీలు అన్నింటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా విషయంలో సమస్యలు వున్నాయి. మరి వీటిని పట్టించుకోకుండా రాహుల్ హోదా ఇచ్చేయగలరా?

Image result for rahul gandhi

అంతెందుకు, ఆంధ్రకు హోదా ఇస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు తెలంగాణలో జనం ముందుకు ఓట్ల కోసం కాంగ్రెస్ వెళ్లగలదా? గెలిచిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకే వివిధ పార్టీలను బజ్జగించాలి, వరాలు ఇవ్వాలి. అలాంటి టైమ్ లో తొలిసంతకానికి ఆ పార్టీలు అడ్డంపడవన్న గ్యారంటీ ఇవ్వగలదా? పోనీ సెటిలర్ల ఓట్లు సులువుగా వస్తాయి. తెలంగాణ మహాకూటమి మానిఫెస్టోలో హోదా ఇవ్వడం అనే దానిపై ఓ మాట చేర్చగలరా?

Image result for rahul gandhi

కానీ రాహుల్ గాంధీ మాట ఒక దానికి మాత్రం పనికి వచ్చింది. తెలుగు మీడియాలో బ్యానరు స్టోరీలుగా వేసి, రాహుల్ గాంధీ పల్లకీని మరింత పదిలంగా మోయడానికి మాత్రం పనికి వస్తోంది. తెలుగుదేశం పొత్తు ఎలావుంటుందో? కేసీఆర్ కు, మోడీకి, ఇలా చాలా మందికి తెలియవచ్చింది. ఇక రాహుల్ కు తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: