తాజా మాజీ ఎంఎల్ఏ, పార్టీలో జూనియ‌ర్ నేత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్ద ప్ర‌మోష‌నే ఇచ్చింది.  టిడిపి నుండి రేవంత్  ఈ మ‌ధ్య‌నే కాంగ్రెస్ లో చేరారు.  ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నా వారందరినీ ప‌క్క‌న‌పెట్టి మ‌రీ రేవంత్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌మోష‌న్ ఇవ్వ‌టం చెప్పుకోద‌గ్గ అంశ‌మే. కాక‌పోతే సీనియ‌ర్లే ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తారో అర్ధం కావ‌టం లేదు. ప్ర‌స్తుతానికైతే సీనియుర్ నేత‌, ఎంఎల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి మాత్ర‌మే నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. 


 ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌ధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక విధంగా రైట్ స్టెప్పే తీసుకుంది. ఎందుకంటే, రేవంత్ మంచి వాగ్దాటి ఉన్న నేతే కాకుండా బాగా చొర‌వున్న నేత  కూడా.  తెలుగుదేశంపార్టీతో పొత్తుల నేప‌ధ్యంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహూల్ గాంధి కూడా రేవంత్ కు బాగానే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ను రేవంత్ పార్టీలో  చేరిన‌పుడే ఆశించారు. అయితే, పార్టీలో  చేరిన వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి కీల‌క స్ధానం అప్ప‌గిస్తే సీనియ‌ర్లంద‌రూ తిరుగుబాటు చేసే ప్ర‌మాదం ఉంద‌ని ఢిల్లీ నేత‌లు అనుమానించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కోరిన ప‌ద‌వి ఇస్తామ‌ని అప్ప‌ట్లో హామీ ఇచ్చారు. 


అయితే హ‌టాత్తుగా ముంద‌స్తు ఎన్నిక‌లు ముంచుకొస్తున్న నేప‌ధ్యంలో ఇచ్చిన హామీ మేర‌కు రేవంత్ కు కీల‌క‌ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఒక్క రేవంత్ కు మాత్ర‌మే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వంటే ఇబ్బంద‌వుతుంద‌ని జోడుగా పొన్నం ప్ర‌భాక‌ర్ ను కూడా క‌లిపింది.  అంటే రేప‌టి ఎన్నిక‌ల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి హోదాలో రేవంత్ మొత్తం తెలంగాణా అంతా చుట్టుబెట్టేస్తారు. ఎలాగూ మొద‌టి నుండి కెసిఆర్ ఢీ అంటే ఢీ అంటున్నారు కాబ‌ట్టి కాంగ్రెస్ కు ఓ స్టార్ క్యాంపెయిన‌ర్ దొరికేసిన‌ట్లే.  


మరింత సమాచారం తెలుసుకోండి: