2014 లో అన్నీ పార్టీలు ఏకమై జగన్ ను ఒంటరిని చేసి ఓడించారు అయితే ఇప్పడూ పరిస్థితి భిన్నముగా ఉంది. టీడీపీ నుంచి పవన్ బయటికి వచ్చేసి టీడీపీ ని ఒక ఆట ఆడుకుంటున్నాడు.  2014లో టీడీపీకి 'కాపు' కాచిన పవన్, తన సామాజిక వర్గ ఓట్లని జగన్ కి దూరం చేశాడు. ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ ఆ ఓట్లను టీడీపీ నుంచి చీల్చబోతున్నారు. అంటే టీడీపీకి అప్పుడు మెజార్టీ తెచ్చిన ఓట్లే ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడతాయి. పవన్ చీల్చే ప్రతి ఓటూ వైసీపీకి అనుకూలమే అవుతుంది.

Image result for jagan

అంటే అప్పట్లో జగన్ కి మైనస్ అయిన పవన్, ఇప్పుడు ప్లస్ కాబోతున్నారు.  సర్వేలన్నీ జనసేనకు వచ్చే ఓట్ల శాతం 5లోపే అని తేల్చేశాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య వ్యత్యాసం కేవలం 2శాతం ఓటింగ్ మాత్రమే. అంటే పవన్ చీల్చే ఓట్ల శాతం కచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుందనమాట. జనసేనకు ఓటు వేసే తటస్థులు కూడా టీడీపీ ఓటర్లే అనే విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. 

Image result for jagan

ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు గడ్డితిన్నారు... చంద్రబాబుకు అమ్ముడుపోయారనే వార్తలు బలంగా వినిపించాయి. కానీ, జగన్ కు నమ్మకంగా ఉన్న పార్టీ క్యాడర్, దివంగత నేత వైఎస్ఆర్ పై అభిమానం ఉన్న ఓటర్లు ఏ ఒక్కరూ మనసు మార్చుకోలేదు. సో... వైసీపీ ఓటు బ్యాంక్ కి వచ్చిన నష్టం ఏదీలేదు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లని జనసేన చీల్చబోతుంది కాబట్టి ఆ రకంగా 2019లో వైసీపీ విజయానికి ఢోకా లేదనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: