ఆమె పార్టీలోకి వస్తే చాలు ఏపీ రాజకీయాల్లో ఓ ఊపు వస్తుందనుకున్నారు. ఆమె ఫ్యామిలీ బాక్ గ్రౌండ్ తో దూసుకుపోవచ్చనుకున్నారు. అయితే ఆమెను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇప్పటికీ ఆమె పట్ల చూపు పడింది. ఓ కీలక పదవి ఇచ్చారు. ఏకంగా విమానమే ఎక్కించేశారు.  అయితే ఇది  ఆమె పట్ల నమ్మకమా.. అప నమ్మకమా అన్నది ముందు ముందు తేలనుంది.


చిన్నమ్మకు పోస్ట్ :


కేంద్రంలోని బీజేపీ పాలన చివరి అంకంలో పడిన తరువాత ఏపీకి చెందిన ముఖ్య నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన పోస్ట్ ను ఇచ్చారు. ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్  డైరెక్టర్ గా ఆమెను కేంద్రం నియమిస్తూ లేటెస్ట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గ కమిటీ నిర్ణయం తీసుకుంది. నాన్ అఫీషియల్ ఇండిపెండెంట్ హోదాలో ఆమె మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు.


ఈ టైంలోనా :


ఓ వైపు చూస్తే ఎన్నికలు దూసుకువస్తున్నాయి. మరో వైపు ఏపీలో బీజేపీకి అసలు పరిస్తితి బాగోలేదు. టీడీపీ తో దోస్తీ కట్ అయింది. కొత్త పార్టీ ఏదీ చేరలేదు. దాంతో ఒంటరి పోరు వణుకు పుట్టిస్తోంది. చాల మంది సీనియర్లు పక్క చూపులు చూస్తున్న టైం ఇది. పురందేశ్వరి కూడా పార్టీ మారుతాన్న్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆమె కుమారురు హితైష్ లో కలసి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది. మరి ఈ టైంలో ఆమెకు పదవి ఇవ్వడం వెనక మతలబు ఏంటన్న దానిపై చర్చ సాగుతోంది.


ఎన్నో ఆశించారు :


నిజానికి యూపీయే హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి ఈ పదవి చాల చిన్నదే. ఆమె బీజేపీలో చెరినపుడు ఎంతో ఆశించారు. అన్న గారి కుమార్తెగా, కేంద్ర మంత్రిగా బాగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ కలిగిన నాయకురాలిగా ఆమె సేవలను పార్టీ యూజ్ చేసుకుంటుందనుకున్నారు. రాజ్యసభ మెంబర్ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేస్తారనీ ఓ దశలో భావించారు. కుదరకపోతే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారనుకున్నారు. ఇక్కడ టీడీపీతో ఈక్వేషన్లు వల్లనో మరే కారణాలతోనో పక్కన పెట్టారు.



ఇన్నాళ్ళకు ఆమెకు ఈ పదవి ఇచ్చారంటేనే ఆసక్తికరంగా ఉంది. బహుశా ఆమె విసిగి వేసారి మూటా ముల్లే సర్దుకుంటున్న టైంలో జారిపోకుండా చూసుకునేందుకే ఈ పదవి అంటున్నారు. అలా కనుక ఆలొచిస్తే నమ్మకంతో కాదు అపనమ్మకంతోనే పదవి దక్కిందన్నది వాస్తవం. చూడాలి, చిన్నమ్మ ఫ్యూచర్ పాలిట్రిక్స్ ఎలా ఉండబోతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: