ఏపీకి జీవనాడి మాట ఏమో కానీ, రాజకీయ జీవులకు మాత్రం ఇపుడు పోలవరమే దిక్కులా కనిపిస్తోంది. ఏదో విధంగా నీళ్ళు ఇవ్వాలని, ఎన్నికల వేళా పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ వల్ల చుక్క నీరు వచ్చినా మాదే ఘనత అని బీజేపీ గొప్పలు పోతోంది. లేటేస్ట్ గా పవన్ కూడా పోలవరమే శరణ్యం అంటున్నారు. 


అక్కడ నుంచే :


పోలవరం పై పవన్ అస్త్రాన్ని సంధిస్తారని జనసేన చెబుతోంది. ఈ నెల 25 నుంచి పవన్ పశ్చిమ గోదావరి జిల్లా  టూర్ మళ్ళీ మొదలు కాబోతోంది. ప్రజా సంకల్ప యాత్ర రెండవ విడతలో భాగంగా పవన్ పోలవరంపై రాజకీయా బాణాలను సంధిస్తారని చెబుతున్నారు. ఆ విధంగా టీడీపీని టార్గెట్ చేయడమే కాకుండా రైతాంగం మొత్తం మద్దతు సంపాదించాలని  చూస్తున్నారు. అవినీతి, అక్రమాలు అజెండాగా పోలవరంపై పవన్ విరుచుకుపడబోతున్నారట. 


రైతే ట్రంప్ కార్డ్ :


జనసేనాని కొత్త రకం పాలిట్రిక్స్ కి ఇక్కడ నుంచి తెర తీయనున్నారు. గోదావని జిల్లాలకు ప్రాణాధారమైన పోలవరం రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు ఏకంగా ఓ రైతునే తమ పార్టీ అభ్యర్ధిగా పవన్ ఈ టూర్లో ప్రకటిస్తారని భోగట్టా. అదే జరిగిరే యావత్తు  రైతాంగం పవన్ పార్టీ వైపు చూడడం ఖాయమని అలా తమకు గోదావరి జిల్లాలు ప్లస్ అవుతాయని జన సైనికులు  ప్లాన్ చేస్తున్నారు. 
మరి పవన్ పోలవరం అవకతవకలు నిలదీస్తే టీడీపీకి బాగా ఇరకాటమేనని చెప్పాలి.


కాగ్ నివేదికలతో పాటు అంచనాలు నాలుగింతలు చేసిన వైనాన్ని తవ్వి తీస్తే సైకిల్ పార్టీకి చిక్కులు తప్పవని అంటున్నారు. మరి చూడాలి పవన్ లేటెస్ట్ గా చేయబోయే టూర్లో ఎన్ని రాజకీయ బాంబులు వేస్తారో. ఎవరి మీద అవి పడతాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: