రాజకీయం అంటేనే ఎన్నో తలనొప్పులు, మరెన్నో తంటాలు. అధినేతలకు ఆ శిరభారం చెప్పనలవికాదు. ఆయన చూపు అన్ని వైపులా ఉంటుంది.  అందరి బాధలు వినాలి, మరి అలాంటి వేళ సహనం, ఓర్పు ఉండాలి. నాయకుడు అందరి వాడు అన్న భావన పార్టీ నాయకుల్లో ఉండాలి. అపుడే ఆ పార్టీ గొడవలు వీధిన పడవు. అలాంటి మెకానిజం లేనప్పుడు అంతా రచ్చ రచ్చే.


బ్యాలెన్స్ తప్పుతోందా :


పార్టీలో అతి క్రమశిక్షణ  కూడా ఒక్కోసారి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వైసీపీలో చూసుకుంటే జగన్ కొన్ని పద్ధతులు పాటిస్తారు. అది నచ్చని నాయకులు ఏకంగా  మీడియాకు ఎక్కుతున్నారు. ముఖ్యంగా పదవుల టైంలో, టిక్కెట్ల గొడవలు ముదిరినపుడు ఇది అనేకసార్లు  బయటపడుతోంది. గడచిన నాలుగేళ్ళ కాలంలో సొంత పార్టీలోనే జగన్ ని నిందించి బయట రచ్చ చేసిన వాళ్ళు కో కొల్లలు. ఇదంతా ఎందుకు జరుగుతోంది. పార్టీ బ్యాలన్స్ తప్పుతోందా


ఇక్కడే ఎందుకు :


అధికార పార్టీలో గొడవలు సహజం. ఎన్నికల వేళ అవి రెట్టింపు అవుతాయి. కానీ చిత్రంగా ప్రప్రతిపక్షం  వైసీపీలో పేచీలు ఎక్కువవుతున్నాయి. టికెట్ కోసం యుద్ధమే జరుగుతోంది. అసలు ఎన్నికలకు ఇంకా చాలా  సమయం ఉంది. ఇంతలోనే వివాదాలు రాజుకుంటున్నాయి. నిజంగా టీడీపీలో చాలా రద్దీ ఉంది. సొంత పార్టీ తో పాటు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా చాలా  మంది అక్కడ ఉన్నారు. ఆశావహులు విషయం చెప్పనక్కరలేదు. మరి అక్కడ గొడవలు ఎందుకు రేగడం లేదు.


నచ్చచెప్పలేరా : 


ఏ నాయకుడైనా పార్టీకి పని చేసి టికెట్ ఆశిస్తాడు. అది తప్పు కాదు, కానీ అందరికీ ఆ పార్టీ టికెట్లు ఇవ్వలేదు. ఆ టైంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అధి నాయకుడు వివరించి చెప్తే పార్టీలో కలహాలకు బ్రేక్ పడుతుంది. కానీ వైసీపీలో అలా జరగడమేలేదనుకోవాలి, లేదా చెప్పే తీరులోనైనా లోపం ఎక్కడో ఉండి ఉండాలి. అందువల్లనే ఒకరికి టికెట్ అని ప్రచారంలోకి రాగానే రెండవ నాయకుడు రోడ్డు మీదకు ఎక్కుతున్నాడు. అపుడు మొత్తం బురద పార్టీపైన పడుతోంది. జనాల్లో కూడ నెగిటివ్ గా వెళ్తోంది. మరి దాన్ని ఇప్పటికీ సరిదిద్దుకోలేకపోవడం వైసీపీ తప్పిదమే.


మరింత సమాచారం తెలుసుకోండి: