వైసీపీ అధినేత జగన్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న నెల్లూరు జిల్లాకు చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్ది రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు ఉత్తరాంధ్రకు చెందిన మరో నేత పార్టీని వీడారు. ఎన్నికల టైంలో ఇలా జరగడంతో వైసీపీ శ్రేణులలో అలజడి మొదలయింది.


ఆయనుండగానే :


ఓ వైపు ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉధ్రుతంగా సాగుతోంది. జనం జేజేలు పడుతున్నారు. మరో వైపు నాయకులు పార్టీని వీడిపోతున్నారు. మొన్నటిని మొన్న చంద్రబాబు శ్రీకాకుళం టూర్లో వైసీపీ నేత మీసాల నీలకంఠం నాయుడు ఆ పార్టీని వీడి బాబు సమక్షంలో సైకిలెక్కేశారు. ఈ రోజు అదే జిల్లా నుంచి  పలాస మున్సిపల్ మాజీ ఛైర్మన్ వజ్జ బాబూరావు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

వజ్జ బాబూరావు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి దివంగత ఎన్టీ రామారావుపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీకి 2002లో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గౌతు శ్యామసుందర శివాజీ చేతి 17 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


టికెట్ రాకపోతే ఇంతేనా :


వజ్జ బాబూరావు, మీసాల నీలకంఠం, రాఘవేంద్రరావు వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలుసుకునే పార్టీని వీడుతున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే టికెట్ రాకపోయినా పార్టీ కోసం ఎన్నికల వేళ క్రుషి చేస్తే అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని చెప్పే పరిస్తితి లేకపవడం వల్లనే నేతలు జారుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో ఏదొ  గందరగోళం ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: