ఏపీలో ఎన్నికలకి ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన తెలుగు దేశం వైసీపీలలో టెన్షన్ మొదలయ్యింది ఎన్నికల దగ్గరపడే వేళ తమ పార్టీలలో ఉన్న కీలకనేతలు ఒక్కొక్కరుగా జంప్ చేయడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా వైసీపీ నుంచీ వలసలు పవన్ కళ్యాణ్ జనసేన లోకి జంప్ చేస్తుంటే తెలుగు దేశం నేతలు ఇటు వైసీపిలోకి , అటు జనసేన లోకి వెళ్తున్నారు అయితే ఎన్నికలకి ఇంకా రెండు నెలల సమయం ఉంటుందనగా టీడీపీ నుంచీ భారీగా వలసలు జనసేనలోకి ఉంటాయని కూడా అంచలనలు వేస్తున్నారు..
Image result for pitani balakrishna

ఇదిలాఉంటే మరో పక్క  జనసేన పార్టీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి జనసేనకి ఎంతో పట్టున్న ఉభయగోదావరి జిల్లాలోని కీలకనేతలు,  ప్రజా పోరాట నాయకులు పార్టీలోకి చేరడంతో ఆయా జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటోంది..తూగో జిల్లా ముమ్మడివరం నుంచీ పితాని బాలకృష్ణ ని జనసేన పార్టీ మొదటి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించడంతో ఒక్క సారిగా తూగో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి..తెలుగుదేశం ,వైసీపీలు ముమ్మిడి వరంలో రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే జనసేన జోరు ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలాఉంటే ఇప్పుడు మరొక సంచలన విషయం జనసేన వర్గాలలో జోరుగా వినిపిస్తోంది..ఈ వార్త తెలుగుదేశం గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తోందనే చెప్పాలి అదేంటంటే..బీసీల కంచుకోట తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలకి పవన్ కళ్యాణ్ అదే బీసీ అభ్యర్ధికి మొదటి టిక్కెట్టు ఇవ్వడంతో ఖంగుతిన్న నేతలు ఇప్పుడు జనసేన  మొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్ధిగా బీసీ మహిళకే టిక్కెట్టు ఇవ్వనున్నారట..ఇప్పుడు ఈ వార్త టీడీపీ, వైసీపీలలో మరింతగా గుబులు పుట్టిస్తోంది.  

కాకినాడ రూరల్ కి చెందిన జనసేన నాయకురాలు , బీసీ మహిళా నేత అయిన “కడలి ఈశ్వరి” కి బీసీ మహిళా కోటాలో పార్టీ తరుపున రెండవ టిక్కెట్టు ఇవ్వనున్నారట..గతంలో ఆమె వైసీపీలో ఉన్నా అక్కడ అవమానాలు భరించలేక పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నడవాలనే  కోరికతో పవన్ సమక్షంలో 2016 లోనే జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. అప్పటినుంచీ పార్టీ ఎదుగుదలకి ఎనలేని కృషి చేశారు..కాకినాడలో తన సొంత శెట్టిబలిజ సామాజిక వర్గంలోనే కాకుండా అత్యధిక ఓట్లు ఉన్న కాపు వర్గాలలో కూడా ఆమెకి మాంచి పట్టుఉంది..అంతేకాదు దళిత వర్గాల నుంచీ అత్యంత కీలకంగా ఉన్న మత్యకార కుటుంభాలలో కూడా కడలి ఈశ్వరి అంటే ఎంతో అభిమానం చూపుతారు అక్కడి ప్రజలు. కాకినాడ రూరల్ లో ఈశ్వరి సామాజిక వర్గం అయిన శెట్టి బలిజ ఓట్లు ఎక్కువగా ఉండటం అదే సమయంలో పవన్ సామాజిక వర్గం అయిన కాపుల ఓట్లు కూడా అధికంగా ఉండటం ఆమెకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: