ఆయన పేరు సంగతేమో కానీ అంతా మండలి రాజు గారూ అంటారు. ఎందుచేతనంటే  దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఉమ్మడి ఏపీలో శాసనమండలి పునరుద్ధరణ వెనక రాజుగారి చేసిన క్రుషి చాలా ఉంది. మండలి కావాలని నాటి సీఎం వైఎస్సార్  అనుకుంటే తెచ్చేందుకు తెర వెనక వర్క్ అంతా రాజు గారు చేశారు.


బీజేపీ నుంచి :


అయితే ఆ తరువాత అ ఆయనకు దక్కింది మాత్రం పెద్దగా ఏమీ లేందంటారు వైఎస్ జమానా ముగిసాక ఆయన మరీ వెనకబడ్డారు. విభజన తరువాత బీజేపీలో చేరిన రాజు గారు మరో ఎమ్మెల్సీ మాత్రం కాలేకపోయారు. దీంతో ఈసారి ఆయన వైసీపీ వైపు చూశారు


జగన్ సమక్షంలో :


వైసీపీ అధినేత జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు ఈ రోజు పార్టీలో చేరారు. మాజీ మంత్రి కూడా అయిన కంతేటి సత్యనారాయణ రాజు గారికి గోదావరి జిల్లాలో మంచి పేరుంది. అన్నిటికంటే ఆయన వైఎస్ అభిమాని. మరి ఆయన రాకతో వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.


జగన్ కి జేజేలు :


కాగా, మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు చేరువలో ఉన్న జగన్ కి విజయనగరంలో జనం జేజేలు పలికారు. జగన్ విశాఖ పొలిమేరలు దాటి విజయనగరంలోకి చేరింది. కాగా  ఇడుపులపాయలో మొదలైన జగన్ ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 12 వ జిల్లా విజయనగరంలో ప్రవేశించింది. జిల్లాలోని ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద జగన్ ఈ 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతున్నారు. దీంతో పార్టీ నాయకులంతా ఖుషీ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: