2014 ఎన్నికలలో మోడీ నామ జపం చేసిన టిడిపి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బట్టి భారతీయ జనతా పార్టీ ని ప్రధాని మోడీ ని ఆంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి అనేక తంటాలు పడుతోంది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలు మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించారని తెగ ఊదరగొట్టినా టిడిపి నాయకులు...ప్రస్తుతం 2019 ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు.

Image result for modi

తాజాగా ఇటీవల రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి. ఐక్యరాజ్యసమితి ఆహ్వానం చంద్రబాబుకు వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడికి అసూయగా ఉందని టిడిపి ఎంపి మురళీమోహన్‌ విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి చంద్రబాబు వెళ్లకుండా అడ్డుకునేందుకే.

Related image

మోడి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న అరకు గిరిజన ఎమ్మెల్యె. మాజీ ఎమ్మెల్యెను మావోయిస్టులు కాల్చి చంపడం హేయమైన చర్చగా మురళీమోహన అన్నారు. దీంతో మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు.

Related image

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం చూస్తుంటే అయితే జుట్టు లేకపోతే కాళ్లు అన్నట్టుగా ఉందని కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ క్రమంలో మరి కొంతమంది నాయకులు దమ్ముంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని సవాలు విసురుతున్నారు...మురళీమోహన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ఆంధ్ర ప్రజల ముందు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: