రాఫెల్ డీల్ అనేది ఇప్పుడు అందరికీ అనుమానాలను రేకెత్తిస్తుంది. విపక్షాలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాయి. రాహుల్ గాంధీ గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, ప్రధాని పీఠమెక్కిన నరేంద్రమోడీ, అప్పటినుంచి ఇప్పటిదాకా 'మా ప్రభుత్వంపై అవినీతి మరక పడలేదు..' అని చెప్పుకుంటూనే వస్తున్నారు. పెద్దనోట్ల రద్దు కావొచ్చు, జీఎస్‌టీ కావొచ్చు.. నరేంద్రమోడీ హయాంలో అనేక సంచలన నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్‌ సెస్‌ పేరుతో, జనం నెత్తిన 'పన్నుల భారం' మోపినా, జనం మాత్రం నరేంద్రమోడీని నమ్మారు. పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీకి ప్రజల నుంచి లభించిన సపోర్ట్‌ అంతా ఇంతా కాదు. అంతలా మోడీని, దేశ ప్రజానీకం నమ్మిందన్నది నిర్వివాదాంశం.

Image result for modi and rahul gandhi

మరి, ఇప్పుడు పరిస్థితేంటి.? రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో 'అవకతవకలపై' నరేంద్ర మోడీ ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు.? విపక్షాల విమర్శలకు ఎందుకాయన సమాధానం చెప్పలేకపోతున్నారు.? ఎఐసిసి అధ్యక్షుడు.. బీజేపీ 'పప్పు' అని పిలుచుకునే రాహుల్‌ విమర్శలకు సైతం సమాధానం చెప్పలేని దుర్భర పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఎందుకు కొట్టిమిట్టాడుతున్నారో దేశ ప్రజానీకానికి అర్థం కావడంలేదు.

Image result for modi

తాజాగా రాహుల్‌ మరోమారు రాఫెల్‌ డీల్‌ విషయంలో నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే నరేంద్ర మోడీని 'దొంగ'గా అభివర్ణించిన రాహుల్‌గాంధీ, ఇప్పుడు 'దేశద్రోహి' అనేస్తున్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, మోడీ - రాఫెల్‌ డీల్‌పై పెదవి విప్పలేని పరిస్థితి. ఆ డీల్‌ వెనుక ఎన్నికుట్రలు జరిగి వుండకపోతే, ఎంత అవినీతి ఆ డీల్‌లో వుండి వుండకపోతే మోడీ మౌనంగా వుంటారన్న అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు అందరికీ.

మరింత సమాచారం తెలుసుకోండి: