మొత్తానికి బాబు అండ్ కో అనుకుంటున్నట్లు  ఏదో అవుతోందనిపిస్తోంది. బాబుకు నోటీసులు వస్తాయని ఓ  సినీ నటుడు ప్రకటనలు ఇచ్చినా, నన్ను ఏదో చెద్దామని అనుకుంటున్నారు తమ్ముళ్ళూ అంటూ బాబు ప్రతి మీటింగులో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నా లోలోపల ఏదే తెలియని భయం టీడీపీలో ఉందన్నది నిజం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో వైపు నుంచి బాబుకు షాక్ తగిలింది. ఆయన ఆస్తులపీ విచారణ కోరుతూ దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు  స్వీకరించింది. 


తండ్రీ కొడుకుల పైన :


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్, వేమూరి రవి కుమార్ లు డొల్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఈ పిల్ లో పేర్కొన్నారు. ఈ అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలతో విచారణ జరిపించాలని ముందడుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక‌ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి కె  శ్రావణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.


ఈ రోజే బెంచ్ ముందుకు :


ఈ ప్రజా వ్యాజ్యం  హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఈ రోజే విచారణకు రానుందని చెబుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఓ మాజీ న్యాయమూర్తి స్వయంగా వాదనలు వినిపించబోవడంతో ఈ పిల్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ పిల్ విషయంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాలలో,  రాజకీయ వర్గాలలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: