చంద్ర బాబు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తున్నాడని టీడీపీ మీడియా ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసింది అయితే చంద్ర బాబు స్పీచ్ చూసినవారెవ్వరైనా నివ్వెర పోవాల్సిందే. ఏపీకి పొడవైన తీరరేఖ ఉంది. ఐటీని రెండు దశాబ్దాలుగా ప్రమోట్ చేసింది నేనే. 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి ఏపీ హబ్ గా మారింది. మేం ప్రపంచానికి ఆదర్శంగా మారాం. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. టెక్నాలజీని, ప్రకృతిని కలిపి అద్భుతాలు సాధించవచ్చు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు ఏపీ నుంచే వస్తున్నారు."

Image result for chandra babu

ఇలా సాగింది చంద్రబాబు ప్రసంగం. ప్రతిది నేనే చేశానని చెప్పే ఊకదంపుడు ప్రసంగం తప్పిస్తే అందులో పనికొచ్చే విషయం, ప్రపంచానికి ఏపీ ఎందుకు ఆదర్శం అనే విషయాన్ని పైపైన టచ్ చేసి వదిలేశారు బాబు. ఆవు మూత్రం, పేడ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తామన్నారు తప్ప, అది ఎలా అమలవుతుందో చెప్పలేదు. జీరో బడ్జెట్ సేద్యం గురించి ప్రస్తావించారు తప్ప, రాష్ట్రంలో అది ఎలా అమలవుతుందో బాబు చెప్పలేదు. 

Image result for chandra babu

నిజానికి చంద్రబాబు ఇంతకంటే చెప్పేది కూడా ఏం లేదు. జీరో బడ్జెట్ సేద్యం అని ఘనంగా చెప్పారు బాబు. కానీ ఏపీలో జరిగింది మాత్రం జీరో రుణమాఫీ. ప్రకృతి సేద్యం అనే పదాన్ని విచ్చలవిడిగా వాడారు. కానీ దాని విధివిధానాల్ని ఆయన చెప్పలేరు. మితిమీరిన ఎరువుల వాడకంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని భూములు ఎలా నిర్వీర్వం అయ్యాయో అందరికీ తెలుసు. ఎరువుల అతివాడకం, నకిలీ విత్తనాలు, కత్తి ఎరువుల్ని నిరోధించలేని బాబు.. ప్రకృతి వ్యవసాయం గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: