ఒకపుడు ఆ నిర్మాత తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన బేనర్ పెద్ద నిర్మాణ సమ్ష్తలకు దీటుగా ఓ వెలుగు వెలిగింది. ఆయన వరసగా తీసిన సినిమాలతో టాప్ ప్రొడ్యూసర్ అయిపొయారు. 90 దశకంలో ఆయన గాలి అలా వీచింది. మరి అలనాటి బడా నిర్మాత ఇపుడు రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ స్టార్ట్ అయింది. వస్తే కనుక వైసీపీ వైపునే నిలబడతారనీ టాక్.


జగన్ తో అడుగులు


టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత కె అచ్చిరెడ్డి ఈ రోజు విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని కలసి తమ సంఘీభావం తెలిపారు. జిల్లాలోని  లక్కవరపు కోటలో జగన్  ప్రజాసంకల్పయాత్ర జోరుగా సాగుతోంది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి జగన్ తో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.  ఇపుడు ఈ కలయికపై అపుడే రూమర్ల్స్  స్టార్ట్ అయ్యాయి.  వీరిరువురి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్న సందేహాలు ఈ భేటీ ద్వారా వ్యక్తమవుతున్నాయి.


అచ్చిరెడ్డి దిగుతారా :


గోదావరి జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు సినిమా ప్రముఖులలో అచ్చిరెడ్డి రాజకీయలపై ఆసక్తి ఉన్నట్లు భోగట్టా. క్రిష్ణారెడ్డి యధాప్రకారం తెరవెనక మార్గదర్శకత్వం చేస్తారని టాక్. అదే జరిగితే ఎక్కడ నుంచి పోటీ ఉంటుంది. అసెంబ్లీకా, పార్లమెంట్ కా అన్నది చూడాల్సి ఉంది. కాగా జగన్ పాదయాత్రను ఈ ఇద్దరూ ఓ రేంజిలో పొగిడేశారు. నభూతో నభవిష్యత్ అంటూ గొప్ప  క్రెడిట్ ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: