పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొన్ని రోజులు విరామం తరువాత మళ్ళీ మొదలైంది అయితే ఎప్పటిలాగే అధికార పార్టీ అయినా టీడీపీ నాయకుల మీద విరుచుకు పడ్డాడు. చింతమనేని లాంటి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. చింతమనేని రూపంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సరైన జడ్జి ఉండి, న్యాయ-పోలీస్ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే జైలులో ఉండేవాడు."

Image result for pavan kalyan

ఇలా చింతమనేనిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు పవన్. కేవలం చంద్రబాబు అండ చూసుకొని చింతమనేని లాంటి వీధి రౌడీలు రెచ్చిపోతున్నారని అన్నారు. చింతమనేని లాంటి వ్యక్తి సింగపూర్ లో ఉంటే కర్ర పట్టుకొని కాళ్లుచేతులు విరిచేస్తారని, సౌదీలో ఉంటే తల తీసేస్తారని అన్నారు. ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, ఇలాంటి పనికిమాలిన రౌడీ మన దేశంలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు.

Image result for pavan kalyan

మనం భరించాల్సిందే. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఇలాంటి వ్యక్తి ఉంటే చట్టసభలకు అనుమతించరు. కానీ మన దెందులూరులో మాత్రం ఇలాంటి ఆకు రౌడీలు రూలింగ్ చేస్తారు." శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు వెయిట్ చేసినట్టు.. ప్రజలు కూడా చింతమనేని తప్పుల్ని లెక్కిస్తున్నారని, తప్పకుండా బుద్ధిచెబుతారని అన్నారు పవన్. జనసేనాని విమర్శలపై చింతమనేని కూడా గట్టిగా రియాక్ట్ అయ్యారు. పవన్ లాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: