రేవంత్ రెడ్డి.. తెలంగాణాలో డైనమిక్ లీడర్. అందులో డౌట్ లేదు. ఆయన రాజకీయమే దూకుడుగా ఉంటుంది. తెలుగుదేశంలో ఇలా ప్రవేశించి అలా అల్లుకుపోయారు. ఎంతలా అంటే పార్టీ పుట్టినప్పటినుంచి ఉన్న మోత్కుపల్లి నరసిమ్హులు లాంటి వాళ్ళను సైతం వెనక్కు నెట్టేసెటంతలా. దీనికి ఆయన రాజకీయ నేర్పే కారణం. ఓటుకు నోటు కేసు వచ్చే వరకు రేవంత్ ఒకలా అయితే ఆ తరువాత మరోకలా అని చెప్పాలి. ఇక్కడ ఆయన డైరెక్ట్ గా తెలంగాణా సీఎం కేసీయార్ నే సవాల్ చేస్తున్నారు.


అనూహ్యమేనా :


ఓ వైపు తెలంగాణాలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. రేవంత్ కి కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది. ఆయన తన సొంత నియోజకవర్గం కోడంబల్ లో ఎన్నికల మీటింగుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు ఆయన ఇంటిపైనా ఐటీ, ఈడీ దాడులు గురువారమ్  రోజంతా సాగాయి. ఇది అనూహ్యమేనా అంటే ఇంతలా కాకపోయినా రేవంత్ మీద ఏదో రూపంలో అటాక్స్ ఉంటాయని మాత్రం ఊహించారు. దానికి సంబంధించి  ప్రచారం అయితే జరుగుతోంది కూడా


రేవంతే టార్గెటా:


మొత్తం ఇష్యూని చూసుకున్నపుడు రేవత్ టార్గెట్ గా మారారా అన్న అనుమానాలు బయటకు వచ్చినా రేవంత్ కి గురి పెడితే వచ్చే రాజకీయ లాభాలు ఏమి ఉంటాయన్నది కూడా ఆలొచన చేయాలి.  అంటే రేవంత్ భుజాలపై తుపాకీ గురి పెట్టి వెరే వాళ్ళను లక్ష్యం చేసుకున్నారేమో అనుకోవాల్సివస్తోంది. అలా చూసుకున్నపుడు ఓటుకు నోటు కేసు మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఆ కేసులో తెర ముందు రేవంత్ ఉన్నారు, తెర వెనక గొంతు ఏపీ సీఎం చంద్రబాబు ది అంటారు.



 మరి రేవంత్ పైన ఐటీ దాడులు చూస్తూంటే అసలు లక్ష్యం చాలా పెద్దదే అనిపిస్తోంది. రేవంత్ ని ఒక్కసారి కనుక అరెస్ట్ చేస్తే ఓటుకు నోటు కేసు తో పాటు డొంకంతా కదులుతుంది. అదే జరిగితే మాత్రం రాజకీయంగా బిగ్ షాట్స్ పైనే బాణాలు దూసుకొస్తాయి. అందుకు ముందర హడావిడిగా మాత్రమే రేవంత్ ఇంటిపై ఈడీ దాడులను చూడలేమో


మరింత సమాచారం తెలుసుకోండి: