మనల్ని ఎవరైనా ఒక గదిలో ఒక రెండు గంటలు ఎటూ కదలకుండా కూర్చోపెట్టి  నిర్భందిస్తే అసలు ఉండగలమా ఆ సన్నివేశాన్ని ఊహలోకి కూడా రానివ్వము తలుచుకుటేనే ఊపిరి ఆగిపోతుంది..అలాంటిది కొన్నేళ్ళ పాటు మన పూర్వీకులకి మన భారతీయులకి అలాంటి నరకాన్ని చూపించిన బ్రిటీష్ వారిని దేశం విడిచి పోయేలా శాంతి మంత్రంతో తరిమి తరిమి కొట్టిన ఏకైక వ్యక్తి గాంధీజీ అహింసతో కూడిన సమాజం కావాలని కలలు కన్నారు గాంధీజీ. కొన్ని వందల ఏళ్లుగా కదలనివ్వని బానిసత్వ సంకెళ్ళు..మనిషిని మనిషిగా చూడని సమాజం, ఎదురుగా రవి అస్తమించని సామ్రాజ్యం, వీటన్నిటికి ఎదురు తిరిగి గెలిచిన వీరుడు ఒకే ఒక్క  మోహన్దాస్ కరంచంద్ గాంధీ.

 Image result for gandhiji father of nation

గాంధీజీ తానూ నమ్ముకున్న సిద్దాంతం కోసం మాటని కూడా జవదాటలేదు..ఒక తెల్లటి వస్త్రం ఒక చేతికర్రతో బక్కపలుచని మనిషి దేశానికీ స్వాతంత్ర్యం తీసుకువస్తాడని ఎవరూ ఊహించి కూడా ఉండరు గాంధీజీ తానూ సృష్టించుకున్న కట్టుబాట్లను, రాసుకున్న సూత్రాలను విడిచి ఎప్పుడు బ్రతకలేదు. వ్యక్తిత్వానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చారు అనటంలో సందేహం ఏ మాత్రం లేదు..అయితే గాంధీజీ గురించి చాలా మంది కొన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ఉంటారు అయితే ఎవరికీ తెలియని కొన్ని విషయాలు.గాంధీజీ ఈ మధ్యకాలంలో బహిర్గతం అవుతున్నాయి అవేమిటంటే..

 Image result for gandhiji father of nation

 1. గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఉంది అయితే సాధారణంగా ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే మహాత్మా అనేది ఇంటిపేరుగా అనుకుంటారు కానీ ఇంటిపేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ..అయితే మరి ఈ మహాత్మా అనే బిరుదు ఎవరు ఇచ్చారు అంటే రవీంద్రనాథ్ టాగోర్. 1915 లో గాంధీ గారు  శాంతినికేతన్ వెళ్లి టాగోర్ గారిని నమస్తే గురుదేవ్ అని పిలిచారట, దానికి టాగోర్ గారు “నేను గురుదేవ్ అయితే మీరు మహాత్మా” అన్నారట...ఇక అప్పటి నుంచీ మహాత్మా గాంధీ అనే పిలవడం మొదలయ్యింది.

 Related image

2 జాతి పిత అని మొదటగా సంభోదించినది నేతాజీ సుభాష్ చంద్రబోసు. 1944 లో జాతీయ ఆర్మీ మార్చ్ మొదలైన సందర్భం లో అలా పిలవటం జరిగిందిట

 Image result for gandhiji with subhash chandra bose

3. ప్రశాంతతకి శాంతి స్థాపనకోసం బహుకరించే నోబెల్ పురస్కారానికి సిం గాంధీ జీ 1948 ఎన్నికయ్యారు కానీ ఆ సంవత్సరమే ఆయన చనిపోవటంతో ఆ ఏడాది శాంతి బహుమతి ప్రధానం చేయలేదు.

 unnamed (2)

4. గాంధీజీ తన జీవితకాలంలో రోజుకు సుమారుగా 18 కిలోమీటర్ లు నడిచేవారట. అలా చేస్తే భూమధ్య రేఖ మీదుగా భూమి చుట్టూ రెండు సార్లు తిరిగి రావచ్చు.

 Related image

5. స్టీవ్ జాబ్స్ కి గాంధీజీ అంటే అమితమైన గౌరవం ఇష్టం, తన ఇష్టానికి గుర్తుగా గాంధీజీ వాడిన కళ్ళజోడు తరహా జోళ్ళు వాడేవాడు స్టీవ్ జాబ్స్.

 Image result for steve jobs gandhi

 

6. గాంధీజీ కి హిట్లర్, టాల్స్టాయ్, ఐన్స్టీన్ తో దగ్గరి పరిచయం ఉండేది. ఒకసారి యుద్ధం గురించి ఆలోచనించమని హిట్లర్ ని లేఖ ద్వారా కోరటం జరిగిందట.

 G-8

7. గాంధీజీకి ఫోటోలు అంటే ఇష్టం ఉండేది కాదు. చిత్రంగా ఆ కాలం లో అత్యదికంగా ఫోటోలు ఉన్న వ్యక్తీ గాంధీగారు.

 Image result for gandhiji

 

8. ఆయన తన జీవిత కాలం లో ఎప్పుడు విమానం ఎక్కలేదు. మాతృభాష గుజరాతి అంటే అమితమైన ఇష్టం, ఆయన జీవిత చరిత్రని గుజరాతిలో రాసి తర్వాత ఆంగ్లీకరించారు.

 unnamed (5)

9. 2007 లో ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.

 unnamed (6)

10. 1930 టైమ్స్ పత్రిక మాన్ అఫ్ది ఇయర్ గా గాంధీ ని ఎన్నుకుంది. 1999 లో అదే పత్రిక ప్రకటించిన మాన్ అఫ్ ది సెంచరీ జాబితా లో రెండో స్తానం పొందారు  గాంధిజీ.

unnamed (7)

మరింత సమాచారం తెలుసుకోండి: