పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇదేమి మొదటి సారి కాదు ఇప్పటికే ఒకసారి అన్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రతి సారి ఇలా మాట్లాడి తన విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నాడని చెప్పవచ్చు.  ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజమే. అయితే, ఆ ఆరోపణల మీద గట్టిగా నిలబడ్తారా.? అంటే అదీ లేదు. 'ఏదో సమాచారం వుంది.. ఎవరో చెప్పారు..' అంటూ మాటలు నాన్చేయడం ద్వారా విశ్వసనీయత కోల్పోవడం పవన్‌కళ్యాణ్‌కి అలవాటే.


పవన్ హామీలు వింటుంటే ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.. పింఛన్ పదివేలు...!

 రాజకీయాలన్నాక, ప్రత్యర్థులు మామూలే. అయితే, ప్రాణం తీసేంత ప్రత్యర్థులు చాలా చాలా అరుదు. చంద్రబాబు కావొచ్చు, వైఎస్‌ జగన్‌ కావొచ్చు.. జనంలో తిరిగినవాళ్ళే. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి 'థ్రెట్‌' ఎక్కువే. గతంలో ఆయనపై నక్సలైట్లు దాడి చేశారు కూడా. కాబట్టి, ఆయన తగురీతిలో భద్రత సమకూర్చుకున్నారు. జగన్‌ వెంట కూడా భద్రత వుంటుంది. పవన్‌కళ్యాణ్‌ కూడా, తగినంత భద్రత కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు.


పవన్ హామీలు వింటుంటే ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.. పింఛన్ పదివేలు...!

ఇక, పవన్‌కళ్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శలు చేయడం, దానికి చింతమనేని కౌంటర్‌ ఇవ్వడం.. చింతమనేని అనుచరులు తెరవెనుకాల ఓవరాక్షన్‌ చేయడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. పవన్‌కళ్యాణ్‌ బస చేసిన ప్రాంతానికి చింతమనేని అనుచరులు కొందరు బైక్‌ మీద వచ్చి నానా యాగీ చేశారట.. అదీ అర్థరాత్రిపూట. అంతే, 'మమ్మల్ని చంపేందుకా ఈ కుట్రలు.?' అంటూ పవన్‌ విరుచుకుపడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: