అతను సినీ విశ్లేషకుడు. కానీ బిగ్ బాస్ వన్ ద్వారా  బిగ్ సెలిబ్రిటీ అయిపోయాడు. పవర్ స్టార్ పవన్ తో పెట్టుకుని బాగా పాపులర్ అయ్యాడు. సామాజిక స్ప్రుహ తనలో చాలా ఉందంటున్న ఆయన తొందరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు. ఆయన ప్రస్థానం ఎలా ఎక్కడ నుంచి అన్నది ఆసక్తికరమైన మ్యాటరే మరి.


చిత్తూరు  వేదికగా :


కత్తి మహేష్ ఇపుడు పరిచయం అక్కరలేని పేరు అయిపోయాడు. ఆయన ఈ రోజు ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ తెరపైకి వస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. తన సొంత జిల్లా చిత్తూరు నుంచి బరిలో ఉంటానని కూడా చెప్పేశాడు. అక్కడ ఉన్న రెండు లోక్ సభ సీట్లలో కత్తి చిత్తూరు నే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సొంత వూరు ఆ పరిధిలో ఉండడమే రీజన్.


దళితుల పార్టీ :


తాను ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరనని కూడా కత్తి స్పష్టం చేశేశాడు. తాను దళితుల గొంతును బలంగా వినిపించే పార్టీ నుంచే బరిలో ఉంటాయని అంటున్నాడు. అంటే ఆయన పోటీ చేయబోయే పార్టీ మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ వాదీ పార్టీ నుంచేనా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఇక కత్తి దేశంలో వచ్చేది దళితుల పాలనేనంటూ కూడా గట్టిగా చెబుతున్నాడు. మొత్తానికి కత్తి రేపటి రాజకీయాల్లో  ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: