ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రహస్య పూజలు చేశారా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ సోమవారం తెల్లవారుజామున ద్వారాకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాధపురంలోని నరసింహస్వామి ఆలయంలో  దాదాపు గంటన్నరసేపు  అభిషేకాలు, రహస్య పూజలతో పాటు   ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.

 

పవన్ పేరుపై తాము ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు  ఆలయంలోని అర్చకులు కూడా అంగీకరించారు. అయితే ఏ ఉద్దేశ్యంతో, ఏమాశించి పూజలు నిర్వహించారన్న విషయంలో మాత్రం పెదవి విప్పటం లేదు.  తమతో పవన్ ఏమి మాట్లాడారన్న విషయాన్ని మాట్లాడటానికి కూడా అర్చకులు ఇష్టపడటం లేదు. మొత్తానికి తెల్లవారిజామున 3 గంటల నుండి 4.30 గంటల వరకూ రహస్యంగా పూజలు జరిగిన విషయమైతే వాస్తవమని తేలిపోయింది.  ఇదే ఆలయంలో పవన్ కల్యాణ్ తాంత్రిక పూజలు నిర్వహించినట్లు గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే.


ఇటీవలే విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కూడా అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగిన విషయం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఆ పూజల విషయంలో స్వయంగా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ చుట్టూ ఎన్నో ఆరోపణలు వినిపించిన విషయం సంచలనం రేకెత్తించింది. ఆరోపణలు, విమర్శలపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ నెరెత్తలేదు. అయితే ఏదో తూతూమంత్రంగా ఓ విచారణ జరిపించి ప్రధాన అర్చకునితో పాటు మరి కొందరిపైన చర్యలు తీసుకున్నామనింపించింది. అంతే కాకుండా ఆలయ ఈవో సూర్యకుమారి పైన కూడా బదిలీ వేటు వేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకెంతమంది నేతలు రహస్య పూజలు చేయిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: