ఆయన పోయిన ఎన్నికల ముందు వరకూ ఎవరికీ తెలియదు, కేవలం నాలుగున్నరేళ్ళ కాలంలోనే అన్ని  రాజకీయాలను ఔపాసన పట్టేశారు. అంతేనా దేశ నాయకుల గురించి కూడా విశ్లేషణ  చేసే స్త్యాయికి ఎదిగారు. అతి తక్కువ టైంలోనే టీడీపీ ముఖ్య కూటమి నాయకుల జాబితాలోకి వచ్చేశారు. తన పెర్ఫార్మెన్స్ కి ఫస్ట్ మార్క్ వేసుకున్న రామ్మోహన్ రేపటి తరం టీడీపీకి ధీమాగా కనిపిస్తున్నారు. బస్తీమే సవాల్  అంటున్నారు


మళ్ళీ ఎంపీనే :


వచ్చే ఎన్నికల్లో మరో మారు ఎంపీగానే పోటీ చేస్తానని  సిక్కోలు ఎంపీ కింజరపు రామ్మోహ‌న్ నాయుడు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, మంత్రిని కావాలని కోరిక తనకు లేదని క్లారిటీగా చెప్పారు. తన బాబాయ్ తాను కలసి అవగాహనతోనే రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నారు.


ఎదిగే చోటుందట :



టీడీపీలో నాయకులకు ఎదిగే చోటుందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని రామ్మోహన్ అంటున్నారు. ఆలాగే పార్టీలో పనిచేసే నాయకులను చంద్రబాబు బాగా ప్రోత్సహిస్తారని కూడా చెబుతున్నారీ యువ ఎంపీ. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రజలే కారణమని, తన తండ్రి మరణం తరువాత వారు చూపించిన అభిమానం మరువలేనని అన్నారు.


అది కరెక్టే :


తెలంగాణాలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు కరెక్టేనన్ని రామ్మోహన్ సమర్ధించారు. అక్కడ కేసీయార్ ని ఓడించేందుకే మహా కూటమిలో చేరామని చెప్పారు. బంగారు తెలంగాణా తేవడం కూడా తమ లక్ష్యమని అన్నారు. అసలు కాంగ్రెస్ తో యునైటెడ్ ఫ్రంట్ టైంలోనే కలిసామని కూడా పాత గుట్టు చెప్పేశారు. అప్పట్లో కాంగ్రెస్ యూఎఫ్ కి బయట నుంచి మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.


వాజ్ పేయిలా కాదు :


మోడీ పైన యువ ఎంపీ మాటల బాంబులే పేల్చారు. ఆయన వాజ్ పేయి స్థాయి కాదు కదా ఆయన దరి దాపుల్లో కూడా పోల్చుకునేందుకు వీలు లేద‌ని రామ్మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక జగన్ తాను అవినీతి బురదలో ఉండి ఇతరులపై విమర్శలు చేయడమేంటని గుస్సా అయ్యారు. పవన్ సైతం సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మొత్తానికి ఈ కుర్ర ఎంపీ అందరినీ ఎండగట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: