ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నేతల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రాలో పరిస్థితి చూస్తే ఎన్నికల రాకముందే ఎన్నికల వాతావరణం మొదలయినట్టు గా ఉంది నేతల యొక్క కామెంట్లు భట్టి. ముఖ్యంగా బిజెపి పార్టీ టిడిపి పార్టీ ల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.

Image result for kanna lakshmi narayana

2014 ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో. ఈ క్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రంలో తండ్రీ కొడుకులిద్దరూ ప్రజాధనాన్ని ధోచేస్తున్నారని మండిపడ్డారు.

Image result for chandrababu lokesh

ఇటీవల విజయవాడ నగరం బిజెపి అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం రాజధాని పేరుతో బలవంతంగా 33 వేల ఎకరాలు లాక్కొన్న చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. ఒకవైపు డబ్బులు లేవంటూనే, విలాసాలు చేస్తూ రూ. 1.30 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. పచ్చ కండువా వేసుకున్న వారికే నిధులు, సంక్షేమ పథకాలను చంద్రబాబు అందిస్తున్నారని విమర్శించారు.

Image result for kanna lakshmi narayana chandrababu lokesh

రాజధాని కోసం భూములు తీసుకున్నారే కానీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు మంజూరు చేస్తే..కనీసం రాష్ట్ర ప్రభుత్వం తిరమైన ప్రభుత్వ భవనం ఒకటి కూడా నిర్మించలేదని కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ని విమర్శించారు. ఇంతటి దారుణమైన అవినీతి ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: