తన పాదయాత్రతో ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ నెలలో మొదలు పెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ సంవత్సరం నవంబర్ చివరాకరికి ఆఖరి ఘట్టానికి చేరుకోనుంది. ముఖ్యంగా ప్రజా సంకల్ప పాదయాత్ర తో తన పార్టీ గ్రాఫ్ ఏపీ రాజకీయాల్లో ఎవరికి ఏ పార్టీకి అందని అందనంత ఎత్తుగా పెంచుకున్నారు.

Image may contain: 6 people, people smiling, crowd and outdoor

ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ పరిస్థితి జగన్ పాదయాత్రకు ముందు ఒకలా పాదయాత్ర తర్వాత మరో కల ఆవిష్కరించబడింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే క్రమంలో తన పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల నాయకులను..టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ...2014 ఎన్నికలలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ని గట్టిగా టార్గెట్ చేసి..రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో అన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ...విశ్రాంతి లేని యుద్ధం చేస్తూ సరికొత్త రాజకీయాన్ని నవతరానికి పరిచయం చేస్తున్నారు జగన్.

Image may contain: 2 people, crowd and outdoor

ఈ క్రమంలో తన పాదయాత్ర చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో..పాదయాత్ర అయిన వెంటనే..అమరావతిలో తన నూతన ఇంటిలో కుటుంబసమేతంగా ప్రవేశించి...అక్కడినుంచి భవిష్యత్తు రాజకీయాలను శాసించే విధంగా..అనేక ప్రణాళికలు వేస్తున్నారట జగన్.

Image may contain: 2 people, crowd and outdoor

ఇదే క్రమంలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తన ఇంటికి దగ్గరలోనే నిర్మించుకుంటున్నారు జగన్. ఈ రెండు భవనాలు తన పాదయాత్ర ముగింపు లోపు నిర్మించి ప్రవేశించే ఆలోచనలో ఉన్నారట జగన్. అంతేకాకుండా పాదయాత్ర అయిన వెంటనే...రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేపట్టబోతున్నారు జగన్. మొత్తం మీద వచ్చే ఎన్నికలయ్యేంత వరకు జగన్ విశ్రాంతి లేకుండా ప్రజలతో మమేకమవుతున్నట్లు తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: