అరవింద సమేత సినిమా దసరా భరిలో సిద్ధంగా ఉంది ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకోబోతుంది అయితే ఇంత వరకు ఈ సినిమా కు రావాల్సిన బజ్ మాత్రం రాలేదు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమా పబ్లిసిటీ విషయం లో ఎందుకు ఉదాసీనత గా ఉన్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు.  పెద్ద సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు పబ్లిసిటీ వ్యవహారం అనేది ఒకటి వుంటుంది. ఫ్యాన్స్ కు రకరకాల స్టిల్స్ కావాలి. తరచు అప్ డేట్ లు కావాలి. ఏం జరుగుతోందో తెలియాలి. అందుకోసం సినిమాకు అభిమానులకు మధ్య వారథిగా పీఆర్వో వుంటారు.

Image result for aravinda sametha

కానీ త్రివిక్రమ్ సినిమాకు పీఆర్వోలు కూడా దాదాపు చేష్టలుడిగి వుండాల్సిందే. ఏమీ చెప్పడానికి, చేయడానికి వారి చేతిలో ఏమీవుండదు. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు ఎన్టీఆర్ స్వంత పీఆర్ యూనిట్ వుంది. హారిక హాసినికి స్వంత పీఆర్ యూనిట్ వుంది. రెండు యూనిట్ లు వున్నా కూడా సినిమాకు సరైన పబ్లిసిటీ లేదు. ట్విట్టర్ లో అభిమానుల గోల ఇంతాఅంతా కాదు. అప్ డేట్స్ ఇవ్వమని, మాంచి స్టిల్స్ వదలమని.

Image result for aravinda sametha

కానీ ఈ విషయం త్రివిక్రమ్ వరకు తీసుకెళ్లే ధైర్యం ఎవరికీలేదు. అరవింద సమేత వీరరాఘవకు సరైన పబ్లిసిటీ జరగడం లేదన్న విషయాన్ని హారిక హాసిని జనాల దృష్టికి కూడా ఇండస్ట్రీ జనాలు తీసుకెళ్లారని వినికిడి.. ఎన్టీఆర్ పీఆర్ యూనిట్ ఆ పని చూసుకుంటోందని తమకు ఏం తెలియదని సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఎన్టీఆర్ పీఆర్ యూనిట్ వద్ద కూడా కొందరు ప్రస్తావించినట్లు, దానికి వారి దగ్గర మౌనమే సమాధానం అయినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: