బాలకృష్ణ అభిమానులను చేయి చేసుకోవడం కొత్తేమి కాదు అయితే అది రోజురోజుకు ముదిరి పోతుంది. అయితే  బాలయ్య దెబ్బ ఈసారి ఎంత గట్టిగా తగిలిందంటే, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తగలబెట్టేసేంతలా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అసలే 'మూలిగే నక్క'లా తయారైంది. ఆ మూలిగే నక్క మీద తాటిపండు విసిరేశారు బాలయ్య. 'చచ్చింది గొర్రె..' అనాలిప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి.

Image result for bala krishna

'ఆంధ్రా పార్టీకి చెందిన ఆంధ్రా ఎమ్మెల్యే, తెలంగాణ జనమ్మీద దాడి చేస్తాడా..' అంటూ సోషల్‌ మీడియాలో బాలయ్య చర్యలపై పెద్ద రచ్చే జరుగుతోంది. చెయ్యి చేసుకోవడం కాదు, కాలితో తన్నాడంటూ అసలు విషయం బయటకు పొక్కింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరావేశంతో బాలయ్య ప్రసంగాలు చేసేయడంతో అభిమానులు అంతకన్నా ఆవేశంతో ఊగిపోయారు.

తెలంగాణ టీడీపీకి బాలయ్య 'దెబ్బ'

తెలుగుదేశం పార్టీకి బాలయ్య టూర్‌తో ఊపురావడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే, బాలయ్య తన అభిమానుల్ని కాలితో తన్నారట. అదీ అసలు విషయం. బాబ్బాబూ.. బాలయ్యని మాత్రం తెలంగాణ ఎన్నికల కోసం పంపించొద్దు..' అంటూ తెలంగాణ టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబుకి ప్రత్యేకంగా నిన్నటి ఘటన తర్వాత విజ్ఞప్తి చేశారట. ప్రజా ప్రతినిథిగా బాధ్యతాయుతమైన పదవిలో వుండీ, తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్న బాలయ్యను ఏమనగలం.? ఆయన విజ్ఞత అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: