జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఏలూరు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ తాజాగా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ ప్రాంతంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

Image may contain: one or more people, crowd, sky and outdoor

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనపై విష ప్రచారం చేస్తున్న మీడియా ఛానల్ విషయములో మండిపడ్డారు. తెలిసీ తెలియకుండా ప్రసారమాధ్యమాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా జర్నలిజం వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. తాను ఇటీవల నిర్వహించిన పూజల విషయంలో మీడియా అతిగా ప్రవర్తించిందని పేర్కొన్నారు..

Image may contain: one or more people, crowd, beard and outdoor

తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయిస్తే కొన్ని మీడియా ఛానళ్ళు దాన్ని ఏవో రహస్య పూజలు చెయ్యిస్తున్నాని మార్చేశారని,ఇటీవలే ఒక చిన్నారి తాను దాచుకున్న డబ్బుని జనసేన పార్టీకు సాయంగా అందజేయడానికి రాగ అందులోనుంచి పదకొండు రూపాయలు తీసుకున్నాని, ఈ పచ్చ మీడియా వారు దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Image may contain: one or more people, crowd and outdoor

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం లో ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతలు అడవులను దోచేస్తుంటే మీడియాకు కనబడదా అని ప్రశ్నించారు..ఇలాంటి వాటి మీద మీడియా స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే బాగుంటుందని ఏపీ మీడియా కు సూచించారు పవన్. నిజాన్ని చూపించే ధైర్యం లేని మీడియాకు అబద్దాలు చెప్పే నాయకులే వారికి దేవుళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని జనసేన నాయకుల దగ్గర వ్యక్తం చేసినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: