తెలుగుదేశానికి ఈ మధ్య కాలమంతా అచ్చిరావడం లేదు. వరస కష్టాలు వెంటాడుతున్నాయి . దాంతో ఇదేంటి ఇలా జరుగుతోందని పార్టీ శ్రేణులన్నీ ఆవేదన చెందుతున్నాయి. టీడీపీ విషయానికి వస్తే గడ‌చిన రెండు నెలలుగా అన్నీ చెడు వార్తలే వినాల్సివస్తోంది.  ఓ వైపు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్న సందర్భంలో ఇలా జరగడానికి బ్యాడ్ సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు.


అక్కడితో మొదలు :


టీడీపీలో బ్యాడ్ అలా స్టార్ట్ అయింది. అన్న గారి కుమారుడు, పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నందమూరి హరిక్రిష్ణ ఆగస్ట్ 29న ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. దాంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్లైంది. హరి బతికి వుంటే టీడీపీలో ఆ జోష్ వేరేగా ఉండేనడంలో సందేహం లేదు. ఎన్నికల వేళకు ఆయనను చంద్రబాబు సమయానుకూలంగా  ఉపయోగించుకునేవారు. హరి అనూహ్యంగా మ్రుతి చెందడాన్ని పార్టీ యావత్తూ జీర్ణించుకోలేకపోయిందనే చెప్పాలి. సాక్ష్తాత్తు చంద్రబాబు ఎన్నడు లేని విధంగా నైరాశ్యంలో కనిపించారపుడు.


మన్యంలో దారుణ హత్యలు :


అది అలా ఉండగానే విశాఖ మన్యంలో మావోయిస్టులు మంటలు పుట్టించారు. పార్టీకి  బలమైన నాయకత్వాని అందిస్తూ రేపటి ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా తీసుకెల్తున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను సెప్టెంబర్  23న మావోయిస్టులు దారి కాచి మరీ దారుణంగా హత్య చేయడంతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐనా జరగరానిది జరిగిపోయింది. ఇది కూడా ఎన్నికల వేళ జరగడంతో పార్టీకి ఏజెన్సీలో నాయకత్వం సమస్య ఏర్పడింది. మావోల టార్గెట్ అక్కడితో ఆగుతుందా, ఇంకా ఏమైనా ఉందా అన్న సందేహాలతో పార్టీలో ఆందోళన రేగింది


పెద్దాయన షాక్ :


మెల్లగా ఈ ఘటన నుంచి కోలుకుంటున్న టైంలో ఉత్తరాంధ్రకే కాదు, టీడీపీకే పెద్దాయనగా ఉన్న ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో  ఈ రోజు దుర్మరణం పాలు కావడం టీడీపీని నిండా విషాదంలో ముంచింది. మూర్తి పార్టీలో భీష్మాచార్యులు లాంటి వారు. ఆయన సాధన సంపత్తులు పార్టీకి ఎంతో ప్లస్ గా ఉండేవి. రేపటి ఎన్నికల్లో మూర్తి ఇమేజ్ తోనే విశాఖ ఎంపీ సీటు కొట్టాలని టీడీపీ భావిస్తోంది. ఆయన మనవడు, బాలయ్య అల్లుడు భరత్ ని ఎంపీ అభర్ధిగా పోటీకి దించాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో మూర్తి దుర్మరణం పాలు కావడం టీడీపీకి షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి.



అసలు ఎందుకిలా జరుగుతోంది. వరస ప్రమాదాలు, దుర్ఘటనలు, దగ్గరలో ఎన్నికలు ఉంచుకుని విజయం కోసం పోరాడుతున్న టీడీపీకి చెడు సంకేతాలేంటి అన్న చర్చ పార్టీ లోపలా బయటా కూడా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: