తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో పార్టీలోను, అనుచరుల్లోను టెన్షన్ మొదలైపోయింది. ఏ క్షణంలో అయినా రేవంత్ అరెస్టు తప్పదనే ప్రచారంతో అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంతకు అంతటి టెన్షన్ కు కారణం ఏమిటంటే, ఈరోజు ఉదయం విచారణలో భాగంగా రేవంత్ ఐటి శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఓటుకునోటు కేసులో విచారణను వివిధ దర్యాప్తు సంస్ధలు స్పీడ్ పెంచేసిన విషయం అందరూ చూస్తున్నదే. ఆ కేసులో కనెక్షనుందని అనుకున్న సెబాస్టియన్, ముత్తయ్య,  ఉదయసింహ, రణధీర్ లను కూడా ఐటి శాఖ ఉన్నతాధికారులు విచారించారు.

 Image result for vote for cash

గతంలో కూడా ఇదే కేసులో విచారణ జరగటం వీరిలో చాలా మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపటం తెలిసిందే. రేవంత్ కూడా తన అరెస్టు విషయంలో మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు.  ఇప్పటికే ఒకసారి అరెస్టయ రిమాండ్ కు కూడా వెళ్లి వచ్చారు. గడచిన వారం రోజులుగా రేవంత్ ను పలుమార్లు దర్యాప్తు సంస్ధలు విచారిస్తున్న తీరును చూస్తుంటే ఎప్పుడైనా సరే రేవంత్ అరెస్టు తప్పదనే భావనలోనే అందరు ఉన్నారు. దాదాపు మూడున్నరేళ్ళ క్రితం బయటపడిన ఓటుకునోటు కేసులో ఓ ఎంఎల్ఏ ఓటును కొనేందుకు బేరాలు చేయటం రూ. 5 కోట్లకు సెటిల్ చేసుకున్న బేరంలో రూ. 50 లక్షలిస్తు రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

 Image result for vote for cash

అప్పట్లో నామినేటెడ్ ఎంఎల్ఏకి ఇవ్వజూపిన రూ. 50 లక్షల ఆచూకీ కోసమే దర్యాప్తు సంస్ధలు విచారణను ముమ్మరం చేశాయి. మొత్తం కేసులో సూత్రదారులు, తెరవెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలిసినా ఆధారాలతో బయటపడలేదు. దానికితోడు నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడటంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగిన విషయం తెలిసిందే. తెరవెనుక కీలక వ్యక్తి చంద్రబాబే అని అందరిలోను అనుమానాలున్నా ఆధారాలు దొరకలేదు. దొరికిన  ఆడియో టేపులతో చంద్రబాబును విచారించేందుకు దర్యాప్తు సంస్ధలు చేసిన ప్రయత్నాలు కోర్టు అడ్డుకోవటంతో నిలిచిపోయింది. దాంతో కేసు విచారణ దాదాపు ఆగిపోయింది. అలాంటిది తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్న సమయంలో హఠాత్తుగా మొదలైన విచారణతో అందరిలోను టెన్షన్ మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: