వచ్చే ఎన్నికల్లో అంధ్రలో ఏ పార్టీ గెలుస్తుందన్నది ఎవరూ చెప్పలేని స్తితి. ఎందుచేతనంటే  అధికార టీడీపీకి ఎన్ని మైనస్ లు ఉన్నా కొండంత అండగా చంద్రబాబు ఉన్నారు. మరో వైపు వైసీపీకి పట్టుదల కలిగిన నాయకుడు జగన్ ఉన్నారు. ఇక మధ్యలో జనసేన కూడా ఉంది. దీంతో ఎవరు గెలుస్తారన్నాది తలపండిన రాజకీయ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు.


ఒడిసి పట్టేశారా :


ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. నిజానికి ఈ పాటికి అధికార పార్టీ మీద ఓ రేంజిలో అసంత్రుప్తి జనాల్లో పొంగి పొర్లాలి. ఏపీలో మాత్రం అలాంటి సీన్ పెద్దగా కనిపించడంలేదు. ఇందుకు మీడియా మాయాజాలం ఓ కారణమైంతే చంద్రబాబు ఇంద్రజాలం మరో కారణం. ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా తానే  పోషించేస్తూ జనంలో కలియతిరుగుతున్నారు. కేంద్రంపైన విరుచుకుపడుతూనే ఏపీలో విపక్షాన్ని ఏకేస్తున్నారు. ఇలా జనంలో వ్యతిరేకత‌ ఎక్కడా బయటపడకుండా బాగానే మ్యానేజ్ చేస్తున్నారు.


పాదయాత్ర  ప్రభావం :


మరో వైపు కాలికి బలపం కట్టుకుని జగన్ ఏడాదిగా ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. నిజానికి జగన్ రికార్డ్ స్థాయిలో చేస్తున్న ఈ యాత్ర ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పాలి. కానీ టీడీపీ అనుకూల మీడియా ఎక్కడా పాదయాత్ర గురించి ప్రస్తావన లేకుండా నెట్టుకువస్తోంది. అలా పాదయాత్ర ప్రభావాన్ని ఎక్కడికక్కద స్తానికంగానే పరిమితం చేయడంలో మాత్రం బాగానే సక్సెస్ అయింది. అయితే ఏ వైపు వెళ్ళినా జగన్ కి జనం బ్రహ్మరధం పడుతున్నారు. అలా చూసుకుంటే మాత్రం ప్రజా వ్యతిరేకత బాగానే ఉన్నట్లు లెక్క.


ఏకపక్షం కావాలి :


ఇది టీడీపీ, వైసీపె రెండు పార్టీల అధినేతల కోరిక. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలుచుకోవాలి. పాతిక ఎంపీ సీట్లు మన ఖాతాలోనే పడిపోవాలి. ఇది చంద్రబాబు. జగన్ ఇచ్చే నినాదాలు. అంతా అనుకూలంగా ఉందని రెండు పార్టీల నాయకులు తమ క్యాడర్ కి చెప్పుకొస్తున్నారు.  దానికి సంబంధించి లెక్కలు కూడా తమ వద్ద ఉన్నాయని బల్ల గుద్ది మరీ అంటున్నారు. మరి ఆ లెక్కలు కరెక్టేనా. ఎవరు చెప్పేది నిజం.
వార్ వన్ సైడేనా. లేకపోతే మధ్యలో వచ్చిన జనసేనని పవన్ చెబుతున్నట్లుగా ఎవరికి అధికారం దక్కని హంగ్ వస్తుందా. ఏది ఏమైనా ఏపీ ఓటర్ మాత్రం గుంభనంగానే ఉన్నాడు. టైం చూసి వేసే ఓటు బాంబు తో ఎవరి ఏ సైడ్ అన్నది గట్టిగానే చెప్పేస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: