వెనకటికి ఓ రాజ్యంలో రాజుగారు సోమరిపోతుల సత్రం కట్టించారట. అందరికీ అక్కడ ఉచితంగా భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చూశారట. అప్పుడే కనుక ఎన్నికలు, ఓట్లు ఉంటే పాపం ఆ మహారాజుగారికి బంపర్ మెజారిటీ వచ్చేదేమో. చూడబోతే మళ్ళీ అలాంటి సత్రాలు, చిత్రాలు మన ప్రజాస్వామ్య ప్రభువుల జమానాలోనూ కనిపిస్తున్నాయి.


అన్న క్యాంటీన్లు :


తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఓట్ల కోసం ప్రారంభించిన పధకం అన్న క్యాంటీన్లు. దీని వల్ల అసలైన పేదలు ఎంతవరకు లబ్ది పొందుతున్నారో తెలియదు కానీ సోమరిపోతులు మాత్రం బాగా పెరిగారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఠంచనుగా అక్కడికి వెళ్ళి అయిదు రూపాయలకే కంచాలు లాగించేస్తున్నారు. బయట భోజనం డెబ్బయి నుంచి వంద రూపాయలు ఉంది.టిఫిన్ ముప్పయి రూపాయలు పెడితే కానీ రావడం లేదు.
అలాంటిది అన్న క్యాంటీన్లకు కేవలం అయిదు రూపాయలకే పెట్టేసి మిగతాది సర్కార్ భరిస్తోంది. అంటే ఒక్క ప్లేట్ కు కనీసంగా అరవై అయిదు రూపాయలు ప్రజల సొమ్ము అన్న మాట.


అవినీతిమయం :


అన్న క్యాంటీన్లు దండగమారి పధకం, అవినీతిమయం అని మాజీ ఎంపీ ఉడవల్లి అరుణ్ కుమార్ గొంతెత్తి చాటారు. ఆలాగే చాలా మంది అంటున్నారు. ఇందులో పెద్ద స్కామే ఉందని చెబుతున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న దళారీ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు బాగుపడేందుకే ఈ పధకమని కూడా అంటున్నారు. కానీ సర్కార్ కి పస్ట్టదు ఎందుచేతనంటే ఓట్ల పంట పండించుకోవాలి కాబట్టి. ఎన్నికల్లో గెలిచేందుకు  ఎన్ని అయినా చేయాలి కాబట్టి.


ప్యాకెట్ మనీ :


మరో కొత్త పధకం పేరు యువ నేస్తం. అక్టోబర్ 2 నుంచి ఇది అమలులోకి వచ్చింది. యువకుల ఓట్లను కొల్లగొట్టడానికి ఈ స్కీం పెట్టారు. కండలు కరిగించే వయసులో ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం వ్రుధ్ధుల మాదిరిగా పించను ఇవ్వడం ద్వారా వారి శక్తిని చంపేస్తోంది. సోమరిపోతులను చేస్తోంది. పైగా ఖర్చులు ఉంటాయి కదా అంటూ నెలకు వేయి రూపయలట. ఇది మంచి విధానమేనా. మరో వైపు ఏపీలో లక్షల్లో పోస్ట్ లు ఖాలీగా ఉన్నాయి.
బాబు వస్తూనే 58 ఏళ్ళ వాళ్ళనందరినీ 60 ఏళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ పెంచేసి యువకులను మూలన పెట్టారు ఇది చాలదన్నట్లుగా ఇపుడు పించన్ పధకం మొదలైంది.


నిలదీసిన జనసేనాని :


ఇదేం పధకం అంటూ జనసేనాని పవన్ కళ్యాన్ నిలదీశారు. ఉద్యోగం ఇవ్వండి మహా ప్రభో అంటూ అడిగితే ప్యాకెట్ మనీ ఇవ్వడమేంటని గుస్సా అయ్యారు. దీని వల్ల యువత ఏం బాగుపడుతుందని అని కూడా ప్రశ్నించారు. ఇంకోవైపు వైసీపీ కూడా ఇదే మాట అంటోంది. లక్షల్లో జాబ్స్ ఖాళీగా పెట్టి  ఓట్ల రాజకీయానికి టీడీపీ తెర తీసిందని హాట్ కామెంట్స్ చెస్తోంది ఆ పార్టీ.
మొత్తానికి ఎలా చూసుకున్నా ఏపీలో సోమరిపోతులును తయారు చేసే పనికే సర్కార్ రెడీగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటేనేం, మనకు ఓట్లు ముఖ్యం. ఇదే పాలసీ అమలవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: