పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి నాలుగేళ్లు దాటి పోయింది అయితే ఇంత వరకు పార్టీ కోసం విరాళాల రూపంలో ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు. పవన్ ఇచ్చిన పంచ్ డైలాగులతో ప్రోమోలు రెడీ చేసి, చివర్లో అందరి అభివృద్ధి కోసం పోరాడే జనసేనకు విరాళాలివ్వండి అంటూ లింక్ పోస్ట్ చేస్తోంది జనసేన టీమ్. సో.. బహిరంగంగానే విరాళాలకు వెల్కమ్ చెప్పారంటే పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు వేరే చెప్పాలా. వారు కూడా పవన్ కల్యాణ్ మనసులో మాటని అర్థం చేసుకుని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చనమాట. 


చంద్ర బాబు మీద తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...!

విరాళాల విషయంలో మొదటి నుంచీ పవన్ కల్యాణ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. తాను ఎక్కడా, ఎప్పుడూ ఎవర్నీ విరాళాల కోసం అభ్యర్థించలేదు. కొంతమంది ఇస్తామని ముందుకొచ్చినా, టికెట్ కేటాయింపుల విషయంలో తలనొప్పులు ఊహించి సున్నితంగానే తిరస్కరించారు. దాదాపుగా తన సొంత ఖర్చులతోనే ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.  కానీ రాజకీయాలన్నా, పార్టీ నడపాలన్నా చేతిలో తడిలేనిదే కుదరదు అని తొందరగానే గ్రహించారు పవన్ కల్యాణ్.


చంద్ర బాబు మీద తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...!

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి, ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకున్నా నడిచిపోయేవి. కానీ ఇప్పుడు ఒంటరిగా జనాల్లోకి వెళ్తుండటంతో ఆర్థిక కష్టాలు ఒక్కొక్కటే తెలిసొస్తున్నాయి.  దీన్ని అధిగమించాలంటే పార్టీకి ఫండ్ కావాలి, చిన్న మొత్తాలు దీనికి సరిపోవు.. బడాబాబుల సపోర్ట్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఓ వైపు ఫండ్ కోసం వెబ్ సైట్ ఓపెన్ చేశారు. నేరుగా కూడా విరాళాలు తీసుకుంటున్నారు. మొత్తానికి పవన్ కూడా విరాళాల బాట పట్టేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: