వచ్చే ఎన్నికలకు సంబంధించి ఓ జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో ఓటరునాడి విషయంలో స్పష్టత కనబడుతోంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన జరిపిన సర్వేలో వైసిపికి 21 లోక్ సభ సీట్లొస్తాయని స్పష్టమైంది. తెలుగుదేశంపార్టీకి మిగిలిన 4 సీట్లు దక్కుతాయట. ఇంతకీ విషయం  ఏమిటంటే, రిపబ్లిక్ టివి తెలుగు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వైసిపి శ్రేణులకు ఫుల్లుగా జోష్ అనిపించే విషయాలు వెలుగుచూశాయి. వైసిపికి 41.9 శాతం ఓట్లతో స్పష్టమైన మొగ్గు చూపిస్తున్నారు. చంద్రబాబు వైపు 31. 4 ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

రానున్న ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని, తమ పాత్ర లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు కాదని జబ్బలు చరుచుకుంటున్న పార్టీలేవీ జనాల దృష్టిలో సోదిలోకి కూడా కనబడటం లేదని తేలిపోయింది. బిజెపికి 12.5 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 7.2 శాతం మంది ఓటర్ల మద్దతి ఇచ్చారు. జనసేన, సిపిఐ. సిపిఎం కూటమికి 7 శాతం ఓట్లు వస్తాయట.  

 

చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తం చేయటానికి కారణం నిరుద్యోగమే ప్రధానమని స్పష్టమవుతోంది. నాలుగున్నరేళ్ళలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు మండిపోతున్నట్లు తెలుస్తోంది. తాజా సర్వేని సి ఓటర్, రిపబ్లిక్ టివి కలిసి నిర్వహించాయి.  ఆమధ్య ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో 43 శాతం మంది జనాలు మొగ్గు చూపిన విషయం స్పష్టమైంది. సరే, ఈ సర్వేల్లో చెప్పినట్లే ఫలితాలుంటాయా అంటే స్పష్టంగా చెప్పేందుకు లేదు. కానీ జనాల మూడ్ ను ఓ మాదిరిగా అంచనా వేయటానికి పనికొస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: