విశాఖ జిల్లాలో టీడీపీని విషాదం వెంటాడుతోంది. వరసగా ఒకటి తరువాత ఒకటి ఘటనలతో తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. నిన్నటి వరకు కలసి తిరిగిన వారు అనూహ్యంగా మ్రుతి చెందడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందంటూ మధన పడుతున్నారు. ఇదిలా ఉండగా నాయకుల్లో ధైర్యం నింపడానికి కుటుంబ సభ్యులు చొరవ తీసుకుంటున్నారు. అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోతున్నాయి.


అండగా ఉంటా :


అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మూర్తి మ్రుతి చెందిన సంగతి విధితమే. ఆయన మనవడు భరత్ దీనిపై మీడియాతో మాట్లాడుతూ తాతా గారు ఇలా దారుణంగా చనిపోవడం బాధాకరమని అన్నారు. ఆయన అన్ని రంగాల్లో రాణించారని కొనియాడారు. ఆయన అశయాలాను తాము కొనసాగిస్తామని, అందరికీ అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోతున్నాయి. నిజానికి దశాబ్దాల పాటు రాజ‌కీయం చేసినా మూర్తి తరువాత ఆయన కుటుంబంలో ఎవరు బయటకు పెద్దగా తెలిసినది లేదు.
భరత్ అలా కాదు, సినీ హీరో బాలయ్య అల్లుడిగా క్రేజ్ తో ముందుకొస్తున్నారు. దాంతో ఆయనే మూర్తి వారసుడన్నది అందరూ అనుకుంటున్న మాట.


ఎవరీ భరత్ :


మూర్తి  పెద్ద కుమారుడు పట్టాభి రామారావు కుమారుడే భరత్. అంతే కాదు సినీ నటుడు బాలక్రిష్ణ రెండవ కుమార్తె తేజస్విని భర్త. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూతురు కొడుకు. అంటే అయనకూ మనవడే. ఇటు తెలుగుదేశంలో మూర్తి శిఖరాయమానం. అక్కడ కాంగ్రెస్ లో కావూరి సీనియర్ నేత. ఇపుడు ఆయన బీజేపీలో ఉన్నా వెటరన్ పొలిటీషియన్. మరి ఇంతలా రాజకీయ నేపధ్యం ఉన్నా భరత్ రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.


ఎంపీ టికెట్ :


భరత్ కి విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించాలని మూర్తి ఆలోచించేవారు. వచ్చే ఎన్నికల్లో తాను వెనక ఉండి మనవడిని ఎంపీ చేయాలని ఆయన తపన పడేవారు. దానికి తగిన గ్రౌండ్ వర్క్ కూడా రెడీ అయింది. బాలయ్య కూడా తన రెండవ అల్లుడికి టికెట్ కోసం లాబీయింగ్ ఓ వైపు చేస్తున్నారు. ఇంతలో మూరి హఠాన్మరణం ఆ కుటుంబాన్ని, అభిమానులను కూడా క్రుంగదీసింది. అయితే మూర్తి వారసుడిగా భరత్ అన్నది మాత్రం కన్ ఫార్మ్ అయిపోయింది.
నిన్నటి వరకు ఇన్నర్ సర్కిల్స్ లో ఉన్న ఈ విషయం ఇపుడు బయటకు కూడా వెల్లడైంది.  మూర్తి లేని ఈ సమయంలో ఆయన కుటుంబానికి న్యాయం చేసేందుకు, భరోసా ఇచ్చేందుకైనా విశాఖ ఎంపీ టికెట్ భరత్ కి ఇస్తారన్న టాక్ నడుస్తోంది. ఓ వైపు మూర్తి ఆకస్మిక మరణంతో డీలా పడిన క్యాడర్ కి భరత్ రూపంలో కొత్త నాయకత్వాన్ని అందించాలని పార్టీ భావిస్తోంది. యువకుడైన భరత్ విశాఖలోనే చదువుకున్నారు. రేపటి ఎన్నికల్లో పోటీకి ఆయనే సరైన క్యాడిడేట్ అని అంతా ఇపుడు అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: