చంద్ర బాబు మీద కేసీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతీ తెలిసిందే. దీనితో పచ్చ పత్రిక పచ్చ తమ్ముళ్లు భగ్గు మంటున్నారు.వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ తన ఎన్నికల ప్రసంగంలో చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఆయనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. నల్గొండ జిల్లాకు మేలుచేసే వాటితో పాటు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులను అడ్డుకోడానికి చంద్రబాబు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. పనిలో పనిగా తన శైలిలో చంద్రబాబును రాక్షసి అంటూ, ద్రోహి అంటూ దూషించారు.

Image result for chandrababu naidu

కేసీఆర్ ఇలా అవమానకరంగా మాట్లాడడం అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లందరూ ఖండించవలసిన విషయం అట! చంద్రబాబునాయుడు అన్న మాటల గురించి తెలంగాణలోని ప్రతి ఆంధ్రుడు ఆలోచించాలట. అక్కడి ప్రతి ఆంధ్రుడు ఓటు అనే ఆయుధంతో చంద్రశేఖరరావుకు ఆంధ్రుల పవర్ ఏమిటో చూపించాలట. ఇలాంటి  ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఇక్కడ సాధారణమైన వ్యక్తులకు ఓ ధర్మసందేహం వస్తోంది. చంద్రబాబునాయుడును ద్రోహి అని కేసీఆర్ తిట్టేసి ఊరుకోలేదు. నిర్దిష్టంగా కొన్ని ఆరోపణలు చేశారు. మరి తెలుగుదేశం వారికి ధైర్యముంటే, తమ చిత్తశుద్ధి మీద నమ్మకముటే ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి.

Image result for chandrababu naidu

అంతేతప్ప.. తిట్టాడు గనుక.. ఆంధ్రోళ్లంతా చంద్రబాబు పల్లకీ మోయాలనడం ఎలా కరెక్టు? తిట్లు ఎదురౌతాయని తెలీకుండానే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చారా? మోడీని బాబు ‘ద్రోహం చేశారు’ అంటున్నారు. బాబును కేసీఆర్ ‘ద్రోహి’ అంటున్నాడు. ఏంటి రెండింటిలో తేడా? తెలుగుదేశం శ్రేణులు ఇలా చవకబారు ప్రచారంతో సానుభూతి పొందాలని చూస్తే మరింతగా బెడిసికొడుతుందని వారు తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: